ఇప్పటికే కరోనా ధాటికి అల్లాడిపోతున్న రెండు తెలుగు రాష్ట్రాలు రాబోయే 24 గంటల్లోనే వరుసగా ముప్పులను చవిచూడనున్నారు. మొదటిగా వాతావరణ శాఖ రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చాలా వేగంగా బలపడుతున్న నేపథ్యంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఏపీ మరియు తెలంగాణలలో వస్తాయని అంచనా వేశారు. మధ్యనే వరుస తుఫాన్ లు తోర ప్రాంతంలో అల్లకల్లోలం రేపిన నేపథ్యంలో వర్షపాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీగా నమోదు కానుందట. దీని వల్ల ఎంత నష్టం జరుగుతుందో.

 

ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి జూనియర్ డాక్టర్ల తో పాటు సీనియర్ ఫిజీషియన్ లు కూడా వారికి మద్దతుగా గాంధీ ఆస్పత్రి బయట ధర్నా చేయడం గమనార్హం. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రి నిండుగా కరోనా వైరస్ కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వారందరికీ చికిత్స అందకపోతే తర్వాత పరిస్థితి ఏమవుతుందో అని ప్రభుత్వం వారు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆస్పత్రి బయట జనాలు ధర్నా చేయడం మరియు వారిని చూసేందూ వచ్చిన వారు అందరూ రిస్క్ లో పడతారని అధికారులు భయపడుతున్నారు.

 

ఇక ఇదే సమయంలో ప్రముఖ సామాజికవేత్త సునీతా కృష్ణన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మళ్లీ పూర్తి లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వారికి సునీతా కృష్ణన్ విన్నవించుకున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల కి షాక్ మీద షాక్ లు ఇచ్చిన హైకోర్టులు విషయంలో ప్రభుత్వానికి పూర్తి లాక్ డౌన్ అమలు చేయమని ఆదేశించే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేద, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తం అవుతుంది.

 

ఇకపోతే మళ్లీ దేవాలయాలు తెరిచారని భక్తజనులు సంతోష పడుతుంటే... ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి గుడిలోని పూజారికి కోవిడ్ పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు అతని నుంచి అది ఎంత మందికి సోకింది అన్న విషయంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.. ఇలా వరుసగా చూస్తే అటు కరోనాతో.. ఇటు వారావరణంతో రాబోయే 24 గంటలు రెండు తెలుగు రాష్ట్రాలు భారీగానే పోరాడాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: