108, 104 వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. నిపుణుల కమిటీ సూచనలతో ఈ వాహనాలను కొనుగోలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి అవినీతీ జరగలేదంటూ.. ఈ అంశానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆంబులెన్స్‌ల కొనుగోళ్లపై వస్తున్న ఆరోపణలు.. ప్రభుత్వం ఖండించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 108, 104 వాహనాల కొనుగోళ్లలో ఎలాంటి అవతవకలు జరగలేదని.. వివరణ ఇచ్చింది. దీనిపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్దమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. లెక్కలతో సహా వివరాలు వెల్లడించింది.

 

రాష్ట్రవ్యాప్తంగా 439 ఆంబులెన్స్‌లు ఉండగా.. వాటిలో 50 శాతానికిపైగా సరైన స్థితిలో లేవని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. 108, 104  వాహనాలలోని పరికరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదని చెప్పింది. ప్రస్తుతం ఉన్న 292 ఎంఎంయూలన్నీ సరిగ్గాలేవని .. నిపుణుల కమిటీల సూచనలతోనే కొత్తగా 432... 108 వాహనాలను కొనుగోలు చేయాల్సివచ్చిందని చెప్పింది. కాగా, 767.. 104 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపింది.

 

రెండుసార్లు టెండర్లు పిలిచినా 108, 104 వాహనాలకు సరైన స్పందన రాలేదనీ.. దీంతో జ్యుడీషియరీ ప్రివ్యూకి టెండరు డాక్యుమెంట్లను పంపించినట్టు ప్రభుత్వం తెలిపిందిఫౌండేషన్‌ కన్సార్షియం, ఎంకేపీ ఇంపెక్స్‌, ఎల్‌ఎల్‌పీ కన్సార్టియంలుఅరబిందో ఫార్మా ఫౌండేషన్‌ కన్సార్షియం, ఎంకేపీ ఇంపెక్స్‌, ఎల్‌ఎల్‌పీ కన్సార్టియంలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయని చెప్పింది. ఎంకేపీ ఇంపెక్స్‌, ఎల్‌ఎల్‌పీ కన్సార్టియంల నుంచి సరైన స్పందన రాలేదని.. ఒకే బిడ్‌ దాఖలు కావడంతో టెండర్లను మళ్లీ పిలిచినట్టు చెప్పింది. 

 

ఈ ఏడాది జనవరి 3న మరోసారి టెండర్లు పిలవగా..  టెండర్లను అరవిందో ఫార్మా ఫౌండేషన్‌ దక్కించుకున్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.  రివర్స్‌ వేలం ప్రక్రియ ద్వారా 185కోట్ల 53 లక్షల రూపాయలు ఆదా చేసినట్టు తెలిపింది. 108, 104 వాహనాల కొనుగోళ్లలో మొత్తంగా.. రివర్స్‌ వేలం ద్వారా 399 కోట్లు ఆదా అయినట్టు ప్రకటించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: