ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీ అయి ఉండి సొంత పార్టీ, ప్రభుత్వం పైనే నెగిటివ్ గా మాట్లాడటం లాంటివి చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో వైసీపీ పార్టీ నుంచి రఘురామ కృష్ణంరాజు కు షోకాస్ నోటీసులు జారీఅయ్యాయి . ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించి ఇదే హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ఈ నేపథ్యం లో రఘు రామకృష్ణంరాజు కు సంబంధించి రెండు వాదనలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయా ల్లో వినిపిస్తున్నాయి. 

 

 రఘురామ కృష్ణంరాజు కు  కేంద్రం లో ఎంతో పలుకుబడి ఉందని అందుకే బీజేపీ లో చేరేందుకు సిద్ధమయ్యారని.. త్వరలో బీజేపీ లో చేర బోతున్నారు  అంటూ ఓ వైపు టాక్  వినిపిస్తుంటే మరోవైపు సీఎం జగన్ తనకు  ఎలాంటి వివాదాలు లేవని కాని  ఒక ఎంపి గా  ప్రజాభిప్రాయం చూపెట్టాలి కాబట్టి ఇలా మాట్లాడుతున్నా ను అని  చెబుతున్నారు రఘు రామకృష్ణంరాజు. అయితే గతంలో మోదీ తో వైసీపీ అధినేత జగన్ కంటే తనకు సన్నిహిత సంబంధం ఉంది అని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. 

 

 కాగా ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ కాగా ఇటీవలే లోక్సభ స్పీకర్ కి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అటు వెంటనే రఘురామ కృష్ణంరాజు ఏకంగా కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం సంచలనంగా  మారిపోయింది. రఘు రామ కృష్ణరాజు ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నారు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది, అయితే ఇలాంటి వ్యవవహారం లో  ఒక స్పీకర్ తప్ప కోర్టులు  జోక్యం చేసుకోవు మరి  రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఏం జరుగుతుంది అనే ఆసక్తి కరంగా మారింది,

మరింత సమాచారం తెలుసుకోండి: