శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో కొన్నేళ్లుగా కనీసం మెయింటెన్స్ చర్యలు తీసుకోవడం లేదని.. ఈ విషయంపై విద్యుత్ కేంద్రం అధికారులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుని ఉంటే.. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని ప్రైవేటు విద్యుత్ సంస్థలకు మేలు చేకూర్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఈ శ్రీశైలం విద్యుత్ కేంద్రంపై నిర్లక్ష్యం వహించిందని..ఇది కుట్ర పూరితమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించి దోషులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంత దారుణం జరిగినా ముఖ్యమంత్రి కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని.. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ఘటనను పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్టు సీబీఐ ఎంక్వయిరీ వేసే అవకాశాలు పెద్దగా లేకపోయినా కేసీఆర్ సర్కారు తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టాలన్నదే రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఆ విషయంలో రేవంత్ రెడ్డి విజయం సాధించినట్టే చెప్పుకోవాలి. జాతీయ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఓ ఎంపీగా తనకు దక్కిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌లోని తన వ్యతిరేకులపైనా రేవంత్ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారని ఈ డిమాండ్‌తో మరోసారి రుజువైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి