ఏపీ రాజకీయాలని రాజధాని అంశం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఎప్పుడైతే అసెంబ్లీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారో, అప్పటి నుంచి రాజధాని రగడ నడుస్తుంది. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు కావాలంటే, ప్రతిపక్ష టీడీపీ మాత్రం మూడు వద్దు, అమరావతిలోనే మొత్తం రాజధాని ఉంచాలని కోరుతున్నారు. పోరాటాలు చేస్తున్నారు. అలాగే అమరావతి రైతులు 300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి టీడీపీ నేతలు మద్ధతు తెలుపుతూ, అమరావతి రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని వైసీపీకి సవాల్ విసురుతున్నారు.

అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు సపోర్ట్‌గా మాట్లాడుతూ, అమరావతి ఉద్యమంపై సెటైర్లు వేస్తున్నారు. ఇంకా దమ్ముంటే టీడీపీనే ఉన్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ విధంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజధాని రగడ జరుగుతుంది. అయితే ఈ రగడ తగ్గాలంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితేనే బెటర్ అని పలువురు విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

అలా అని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లదు. అటు టీడీపీ కూడా అంత తొందరపడి రాజీనామాలు చేయదు. అంటే రాజధాని విషయంలో ఇలా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది తప్పా, రాజధాని అంశంలో మాత్రం ఎవరు రాజీనామాలు చేయరు. కానీ ఒకవేళ జగన్ గానీ రాజధాని విషయంలో ప్రభుత్వం రద్దు చేసినా కూడా, మళ్ళీ ఆయనే భారీ మెజారిటీతో గెలుస్తారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అందులో ఇంకొన్ని సీట్లు వైసీపీనే గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏపీ ప్రజలు రాజధాని అంశాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఒక రాజధాని అయితే ఏంటి, మూడు రాజధానులు అయితే ఏంటి అన్నట్లుగానే ప్రజలు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు పూర్తి మద్ధతు తెలుపుతున్నారు. 2019 ఎన్నికల కంటే ఎక్కువగానే ప్రజలు జగన్‌కు సపోర్ట్ చేస్తున్నారని, తాజాగా ఓ సర్వే కూడా చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి ఏది జరిగినా జగన్‌కే బెన్‌ఫిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: