ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధికారం పై ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నారు.. వైసీపీ అమలు చేస్తున్న పథకాలకు అడ్డుపడుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని విషయాల పై కూడా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ప్రతిపక్షాలు.. ఆ విషయం అందరికి తెలిసిందే.. ఇకపోతే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.మహిళలకు ఆసరాగా డ్వాక్రా రుణాలను అందజేశారు. మొదటి విడుతను గత కొన్ని రోజుల క్రితం మంజూరు చేశారు.



రైతులకు కొత్త పంటలను వేసుకోవడానికి వీలుగా రుణాలను, వాటితో పాటుగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది.. ఈ మేరకు రెండు విడుతలు గా రుణాలను అందిస్తుంది. దాంతో పాటుగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని విద్యా కానుకను ప్రారంభించారు. ఈ పథకం కింద విద్యార్థులకు కావలసిన కిట్ ను అందజేశారు. వృద్దులకు, వితంతువులకు పింఛన్లు పెంపు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ తాహతుకు మించి ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నారు. కోవిడ్ లాంటి మహమ్మారిని, భారీ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.



ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లు రాష్ట్రంలోని ప్రతి పక్ష నేతల తీరు ఉండటం బాధాకరం అని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను మరోసారి నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ విషయాన్ని కోర్టులో వాదనలు వినిపించారు. అయితే అన్నీ పరిశీలించిన కోర్టు తుది తీర్పును ఎన్నికల కమీషన్ కు వదిలేసింది. జగన్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మరోసారి అడిగారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ కు విడుదల చేయవలసిన నిధులను మంజూరు చేయలేదు. అలా చేయడం చట్టరీత్యా నేరం.. రాష్ట్రప్రభుత్వం వెంటనే నిధులను అందించాలని నిమ్మగడ్డ కోరారు. వీటికి సంబంధించి కోర్టులో నివేదికను సమర్పించింది. అందులో ఆర్థిక శాఖ అధికారులను, పంచాయితీ రాజ్ వ్యవస్థ ను పేర్కొన్నారు. జగన్ సర్కార్ కు న్యాయ వ్యవస్థతో చిక్కు అవుతుందా లేదా పరిష్కారం అవుతుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: