దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారారు. ఈ క్లిష్ట సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చారు. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రొమ్ హోమ్ అవసరంగా మారింది. అయితే సంస్థలతో పాటూ ఉద్యోగులూ వర్క్‌ ఫ్రం హోమ్‌ నే ఎంచుకుంటున్నారు. మరి కొంత కాలం పాటూ ఇదే కొనసాగే అవకాశం ఉంది.

అయితే మీరు మీ సాఫ్ట్‌వేర్‌ పనిని మరింత స్మార్ట్‌గా మార్చాలని అనుకుంటున్నారా. అయితే ఈజీగా సౌకర్యవంతంగా మీ పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నారా. మీరు గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతూనే ఉంటారు. దానికే కొన్ని ఎక్స్‌టెన్సన్లను జోడిస్తే సరి. మీ పని ఉత్పాదకతను పెంచడమే కాదు, నిబద్ధతతోనూ పూర్తి చేసేయొచ్చు. అయితే ఆఫీసు పని చేస్తుండగా చీటికి మాటికీ యాడ్స్ వచ్చి చిరాకును తెప్పిస్తాయి. అంతేకాదు అవి పనిపై ఏకాగ్రతని కూడా పోగొడుతుంది. అయితే అలాంటి ప్రకటనలు రాకుండా ఉండాలంటే ఈజీగా ఈ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి.

ఇక వినోద, ఇతర వెబ్‌సైట్‌ల నుంచి నోటిఫికేషన్లు రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఈ ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నించండి. పేరు ‘స్టే ఫోకస్డ్‌’. దీంతో అనవసరపు వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేయొచ్చు. ఎన్నో ఎకౌంట్‌లు, వెబ్‌సైట్‌లలో లాగిన్‌ అవుతుంటాం. కానీ అవసరాన్ని బట్టి కొత్త ఎకౌంట్‌లు తెరుస్తుంటాం. మీరు లాగిన అయిన సైట్‌ల పాస్‌వర్డ్‌లు నిర్వహించే ఓ ఎక్స్‌టెన్షన్‌ ఉంటే? అదే ‘లాస్ట్‌పాస్‌’. ఇది మీ పాస్‌వర్డ్‌లు, అడ్రస్‌లు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ నంబర్లు, పాస్‌పోర్ట్‌, ఇన్సురెన్స్‌ కార్డ్‌ తదితర ముఖ్య సమాచారాన్ని భద్రపరుస్తుంది. ఒక్క మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని మీరు భద్రంగా ఉంచుకుంటే చాలు.

అర్జంటు పనిలో ఉండగా ఏదైనా ఐడియా వస్తే! నచ్చిన ఫొటో కనిపిస్తే.. తర్వాత చేయాల్సిన పని గుర్తుకువస్తే.. కాసేపయ్యాక చూద్దాం అనుకుంటాం. తీరా ఆ సమయానికి మర్చిపోతాం. అలా జరగకుండా చూస్తుంది ‘గూగుల్‌ కీప్’‌. దీంతో మీ ఫొటోలు, యూఆర్‌ఎల్‌ లింక్‌లు, టెక్స్ట్‌, కోట్‌, వెబ్‌పేజీ.. తదితర సమాచారాన్నంతటినీ ఒక్క క్లిక్‌తో పదిలపరచొచ్చు. అవసరమైనపుడు తిరిగి ఉపయోగించుకోవచ్చు. మీ రోజు వారీ ముఖ్యమైన పనులనూ నోట్స్‌ రూపంలో రాసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: