బీజేపీ పార్టీ గ్రేటర్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఆ పార్టీ గెలవడానికి అవలంభించే విధానాలను బట్టి తెలుస్తుంది.. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కి ప్రజలనుంచి మద్దతు లభిస్తుంది.. ఈ మద్దతు ను తమకు అవకాశం గా మలుచుకుని గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం, ప్రచారంలోకి పార్టీ అగ్రనేతలను దింపుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి చరిష్మా ఉన్న నాయకులను అస్త్రాలుగా సంధించింది.

జాతీయ స్థాయిలో క్రేజ్ ఉన్న నేతలను గ్రేటర్ వార్ లోకి దిండచం ద్వారా గెలుపు తీరాలకు చేరుకోవాలనుకుంటోంది బీజేపీ.  అందుకు తగ్గట్లే అమిత్ షా వంటి వారిని దించి మంచి ప్రచారం చేసింది. అయితే వీరి ప్రచారంలో ఎక్కువగా ఒకటే ప్రధానాస్త్రం కనిపించింది. ఎక్కడినుంచి ఏ నేతలు వచ్చి ప్రచారం చేసినా అందరిలో మైనార్టీ లను టార్గెట్ చేయడమే కనిపించిందని చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రచారానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చే శక్తి బీజేపీకే ఉందని ఆధిత్యనాథ్ అన్నారు. ఇప్పటిదాకా పలు నగరాల పేర్లు మార్చామని.. హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగరంగా మార్చుతామని చెప్పారు.

అంతేకాదు ఎంఐఎం గురించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం రూపంలో వస్తున్న మరో నయా నిజాం పథకాన్ని పారనివ్వకూడదని.. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోందని యోగి ధ్వజమెత్తారు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా అంటూ యోగి ప్రజలను ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం వరదసాయం పేరిట మోసం చేసిందని.. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే ఈ నగదును పంపిణీ చేయలేదని యోగి ఆరోపించారు. చూస్తుంటే బీజేపీ మైనార్టీలను టార్గెట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం జరుగుతుందని చెప్పొచ్చు.. ఇది వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: