ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...జగన్ కి  సుప్రీం కోర్టులో పెద్ద రిలీఫ్ లభించింది. గత కొద్ది రోజులుగా సీఎం జగన్‌ ముఖ్యమంత్రి పదవి కోల్పోతారంటూ ప్రచారం చేస్తున్న వారికి సుప్రీం కోర్టు గట్టి షాకే ఇచ్చింది. జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లకు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సీఎం జగన్‌పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడంపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరడం జరిగింది.


అందుకు గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించడం జరిగింది. న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడమేంటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది సీజేఐ పరిధిలోని అంశమని కోర్టు స్పష్టం చేసింది. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని, లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని వెల్లడించడం జరిగింది..


పిటిషన్లలో అభ్యర్థనలు అన్ని గందరగోళంగా ఉన్నాయని సుప్రీం కోర్టు చెప్పటం జరిగింది.అవినీతి నిర్మూలన  కౌన్సిల్ ఎక్కడిదని, నిధులు ఎక్కడివని, కోర్టు ప్రశ్నించింది. లేఖలోని అంశాలపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లు సుప్రీం కోర్టు కొట్టివేసింది. కాగా, సీజేఐకి జగన్ రాసిన లేఖను మీడియాకు విడుదల చేసినందుకు గాను, సీఎం పదవి కోల్పోతారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, పలువురు టీడీపీ నేతలు మొదటి నుంచి వాదిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో వీరికి గట్టి ఝలక్ తగిలినట్లయింది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: