వైసీపీ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. పేదలకు నిర్మించే ఇళ్లను రికార్డు టైమ్ లో పూర్తి చేసి ఔరా అనిపించింది. గతేడాది డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించారు. ఇలా పట్టాల పంపిణీ ప్రారంభం అయిందో లేదో.. ఆ వెంటనే ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించారు. అంతే కాదు, ప్రభుత్వ అధికారులే దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షించారు. మొత్తమ్మీద 24 రోజుల్లోగా ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందించారు.
ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు.. ఆయా లే అవుట్లలో ఇళ్లను నిర్మించి ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని, దానికి తగ్గ ఆర్ధిక సాయం చేస్తుందని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఆమాట ప్రకారమే.. లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకునేందుకు 3 ఆప్షన్లు కూడా  ఇచ్చారు.

మొదటి ఆప్షన్: ప్రభుత్వ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడమే కాకుండా, లేబర్ ఛార్జీలకు డబ్బులు ఇస్తుంది.
రెండో ఆప్షన్: ఇంటి నిర్మాణానికి కావల్సిన సామాగ్రిని లబ్ధిదారులు తమకు నచ్చిన చోట కొనుగోలు చేస్తే.. ఆ డబ్బులను ప్రభుత్వమే దశల వారీగా చెల్లిస్తుంది.
మూడో ఆప్షన్: ప్రభుత్వమే ఇంటి నిర్మాణాన్ని స్వయంగా పూర్తి చేసి.. లబ్ధిదారులకు అందిస్తుంది.

ఈ మూడు ఆప్షన్లలో రెండో ఆప్షన్ ప్రకారం ఇంటి నిర్మాణానికి ముందుకొచ్చిన రత్నకుమారి అనే మహిళకు రాష్ట్రంలోనే జగనన్న కాలనీలో తొలి ఇంటిని నిర్మించి ఇచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన లబ్ధిదారు నరాల రత్నకుమారికి రాష్ట్రంలోనే మొదటిగా.. రెండో కేటగిరీ కింద ఇంటిని నిర్మించారు. ఈ విధానం ప్రకారం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందజేస్తుంది. నిర్మాణానికి కావలసిన సామగ్రిని లబ్ధిదారే సమకూర్చుకోవాలి. ప్రభుత్వ సాయంతోపాటు లబ్ధిదారు రత్న కుమారి అదనంగా రూ.1.20 లక్షలు ఖర్చుచేయడంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఉదాహరణతో జగన్ సర్కారు కేవలం మాటలతో సరిపెట్టదని, చేతల ప్రభుత్వం అని నిరూపించామని చెబుతున్నారు నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: