ఏపీలో సరిగ్గా రెండేళ్ళ క్రితమే జగన్ సర్కార్ కి అతి పెద్ద మెజారిటీ వచ్చింది. ఏకంగా యాభై శాతం పైగా ఓట్లు, ఎనభై శాతం పైగా సీట్లు జగన్ కి దక్కాయి. అంతటి బంపర్ మెజారిటీ వచ్చిన జగన్ కి లోకల్ బాడీ ఎన్నికలు అంటే నల్లేరు మీద నడకే అవుతుంది. నిజానికి వైసీపీ అక్కడ ఎన్నికల సంఘం ఏదో  చేస్తోంది అన్న ఆలోచనే ఉండరాదు. ఎందుకంటే వైసీపీకే జనం పట్టం కడతారు అన్న నమ్మకం ఉంటుంది కాబట్టి.

ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయం ఒకలా ఉంటే విశాఖ జిల్లాలో మరోలా ఉంది. ఇక్కడ జగన్ కానీ వైసీపీ కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచారు. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తామని జగన్ చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిందే అందుకు. ఇక విశాఖలో జనాలు రాజధానికి వ్యతిరకమని విపక్షాలు అన్నీ అంటూ వచ్చాయి.

ఇక టీడీపీ అయితే విశాఖకు రాజధాని కావాలని ఎవరు అడిగారు అంటూ గట్టి వాదిస్తూ వచ్చింది. అలాంటి చోట ఇపుడు పంచాయతీ పోరు సాగుతోంది. 2019లో జనం ఇచ్చిన తీర్పునే తీసుకుంటే వైసీపీకే మొత్తానికి మొత్తం సీట్లు రావాలి. సర్పంచు పదవులు అన్నీ కూడా ఆ  పార్టీ ఖాతాలో పడాలి. కానీ ఇపుడు సీన్ చూస్తే అలా ఉందా అంటే డౌటే అంటున్నారు.

వైసీపీ ఏలుబడిలో సంక్షేమం ఉన్నా అభివృద్ధి అన్నదే లేదు. దాన్నే ప్రధాన అజెండా చేసుకుని టీడీపీ ముందుకు వెళ్తోంది. దాంతో ఇపుడు ఎటూ సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ ఉంది. వైసీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య లాంటివి. ఏపీలో మొత్తం పన్నెండు జిల్లాల్లో ఒక ఎత్తు. విశాఖ మరో ఎత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి.

విశాఖలో కనుక వైసీపీ పెద్ద మెజారిటీతో సర్పంచులను గెలుచుకుంటే మాత్రం కచ్చితంగా జనం జగన్ రాజధాని కోరికకు ప్రజలు   జై కొట్టారనుకోవాలి. అలా కనుక కాకపోతే టీడీపీ దీన్నే పట్టుకుని మూడు రాజధానుల మీద మరింత గట్టిగా యాగీ చేస్తుంది. అపుడు కలల రాజధాని విశాఖ కరిగిపోయి జగన్ కి భారీ షాక్ తగులుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: