గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో పసుపు కడువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే అందులో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు సైతం ఇచ్చారు. అయితే అలా జగన్‌ని మోసం చేసి టీడీపీకి వెళ్ళి మంత్రులైన వారి పరిస్తితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఆ నలుగురు ఓటమి పాలయ్యారు.


ఇక ఓడిపోయిన నలుగురు ఇప్పుడు రాజకీయంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయం ఇబ్బందులు పడుతున్న ఆ మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణరంగరావు, అమర్నాథ్ రెడ్డి. ఈ నలుగురు 2014లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆదినారాయణ జమ్మలమడుగులో, అఖిల ఆళ్లగడ్డలో, అమర్నాథ్ పలమనేరులో, సుజయ బొబ్బిలిలో గెలిచారు. ఇక చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి వెళ్ళి, మంత్రులుగా ఛాన్స్ కొట్టేశారు.


మంత్రులుగా ఉన్నంతకాలం వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి, ఓడిపోయాక అసలు సినిమా మొదలైంది. ఇప్పుడు ఆ నలుగురు రాజకీయంగా నిలబడలేకపోతున్నారు. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణ టీడీపీని వీడి సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్లారు. ఇక ఏపీలో బీజేపీ పరిస్తితి ఏంటో తెలిసిందే.


అటు సుజయ ఓడిపోయాక రాజకీయాలకే దూరం జరిగారు. ప్రస్తుతం బొబ్బిలి బాధ్యతలని ఆయన సోదరుడు బేబీ నాయన చూసుకుంటున్నారు. అంటే రాజకీయాల్లో సుజయ చాప్టర్ క్లోజ్ అయినట్లే. ఇక అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియలు కాస్త టీడీపీలో ఉండి పోరాడుతున్నారు. కానీ టీడీపీలో ఫ్యూచర్ కనిపించడం లేదు. మళ్ళీ ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో వైసీపీనే సత్తా చాటేలా కనిపిస్తోంది. ఆళ్లగడ్డలో పూర్తిగా వైసీపీ ఆధిపత్యం ఉండగా, పలమనేరులో టీడీపీ ఇంకా వీక్‌గానే ఉంది. మొత్తానికైతే ఈ నలుగురు మాజీ మంత్రులకు మళ్ళీ గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: