తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భలే విచిత్రంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్నవారు ఎంతో మంది లీడర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ వారి వారి చుట్టూ తిరిగని రాజకీయమంతా 12 సంవత్సరాల కింద చనిపోయినటువంటి  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి చుట్టూ తిరగడం ఒకింత ఆశ్చర్యమే. ఇప్పటికీ ఆ మహానుభావుడి పేరు రాజకీయాల్లో తిరుగుతూనే ఉంది. తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన వైఎస్ఆర్ ను ఒక విలన్ లాగా మంత్రులు ప్రచారం చేసిన, ఇది వైఎస్ఆర్ ను ఏపీలో  మంచి లీడర్ గా చిత్రీకరిస్తున్నారు.

 ఒకే అంశంపై విరుద్ధ రాజకీయానికి కారణం ఏమిటంటే  జలం తీసుకొచ్చిన జగడమే అని చెప్పవచ్చు. ఈ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఎప్పుడు వచ్చినా ముందుగా వినిపించే పేరు వైయస్ రాజశేఖర్ రెడ్డి. నిజానికి తన హయాంలో ఇప్పుడున్న తెలంగాణలో, ఏపీలో కూడా అనేక ప్రాజెక్టులను మొదలుపెట్టాడు. జలయజ్ఞం పేరుతో చాలా ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు ఆయన. అయితే 2009వ సంవత్సరంలో  రెండోసారి సీఎం అయిన తర్వాత ఆకస్మికంగా ఆయన చనిపోవడం దీంతో ప్రాజెక్టు పనులన్నీ  నెమ్మదిగా ఆగిపోయాయి. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం ఉండి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయి ఉండేవీ. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన టువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఇప్పుడు జగన్ చేస్తున్నది ఏమిటంటే ఆ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం. దీనికి తెలంగాణ నుంచి మంత్రులు అభ్యంతరం చెబుతున్నారంటే తెలంగాణలో నిర్మించిన నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రాజెక్టులు కూడా అనుమతులు లేవు. మొత్తానికి ప్రస్తుత రాజకీయమంతా వైయస్ చుట్టే తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు.


తెలంగాణలో కూడా షర్మిల తన పార్టీని ఇక పట్టు బిగించేందుకు దివంగత రాజశేఖర్ రెడ్డిని అస్త్రంగా  వాడుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధిని ఇప్పటికీ చెప్పుకుంటూ  వైయస్ షర్మిల  పార్టీని ప్రారంభించింది. అలాగే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ  రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులను ఇప్పటికీ ప్రతి సభలో  ప్రచారం చేసుకుంటూ వస్తున్నది. ఏది ఏమైనా 12 సంవత్సరాలుగా రాజకీయాలన్నీ వైయస్ రాజశేఖర్ రెడ్డిని విడిచిపెట్టలేదు అంటే ఆయన ఎంత ఘనత సాధించారనేది అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: