ఈసారిరాబోతున్న స్వాతంత్రదినోత్సవానికి చాలా  ప్రత్యేకత ఉంది. మనదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంత్సరాలు పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా రాబోతున్న స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడానికి  భారత జాతి సమాయుక్తం  అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ ఫెస్టివల్ మూడ్ ను క్యాష్ చేసుకుని కాసులు  దండుకోవాలని అనేక భారీ సినిమాలు భావించాయి.  


కరోనా థర్డ్  వేవ్ అడ్డు తగలండంతో అందరి ప్లాన్స్ తలక్రిందులు అయ్యాయి. కనీసం  ఈ గ్యాప్ ను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ‘లవ్ స్టొరీ’ ‘టక్ జగదీష్’ నిర్మాతలు భావించారు. అయితే థర్డ్ వేవ్ భయాలు వారిని ఒక్క అడుగు కూడ ముందుకు వేయించలేదు.  


యువ హీరో విశ్వక్‌సేన్ తన ‘పాగల్’ మూవీని ఎలాంటి భయాలు లేకుండా విడుదల చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాను నిర్మాతలు ఆగష్టు 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వెంకటేష్ నాని నాగచైతన్య నితిన్ లాంటీ హీరోలు ఓటీటీ వైపు అడుగులు వేస్తుంటే ఈ యువ హీరో మాత్రం థియేటర్ లో రిలీజ్ చేయడం సాహసమే అంటున్నారు. ఇక విశ్వక్ సేన్‌ విషయానికి వస్తే మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారిన విషయం అందరికి తెలిసిందే.  


ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోలలో  విశ్వక్సేన్  ఒకడు గా  కొనసాగుతున్నాడు. ‘ఫలక్‌ నామా దాస్‌’ లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించిన విశ్వక్ సేన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ హీరోను మాస్‌ కా దాస్ అని పిలుస్తూ ఉంటారు. తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్న ఈ యంగ్ హీరో అడుగులు అన్నీ విజయ్ దేవర కొండను అనుసరిస్తూ ఉంటాయి. టాప్ హీరోలు మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలు పూర్తి అయినప్పటికీ విడుదల చేయలేని పరిస్థితులలో ఉంటే విశ్వక్ సేన్ మటుకు సాహసం చేయడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: