ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగులకు జీతాలను సమర్ధవంతంగా ఇవ్వకపోయినా సరే విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక కొందరి ఉద్యోగుల విషయంలో కక్ష సాధింపు వైఖరి తో ఉన్నారు అనే విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. రాజకీయంగా ఉద్యోగులను తమ స్వార్ధానికి వాడుకునే ప్రయత్నం ఏపీలో జరుగుతుంది కొందరు అధికార పార్టీ నేతలు కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం.

హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులను సరిగా చూసుకోవడం లేదనే విమర్శలు కూడా ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నాం. రాజకీయంగా దీనిపై అధికార పార్టీ నేతలు వర్సెస్, విపక్షాలుగా పరిస్థితి మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తాత్కాలికంగా తరలి వచ్చిన ఉద్యోగులకు వసతి సౌకర్యం కట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. సెక్రటేరీయేట్, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు వచ్చే నెల నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు కాసేపటి క్రితం జారీ అయ్యాయి.

నవంబర్ 1 తేదీ నుంచి ఉద్యోగులు ఎవరి వసతి వారు సొంత ఖర్చులతో భరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం... ప్రస్తుతం 2021 ఆగస్టు నుంచి ఆక్టోబరు 31 తేదీ వరకూ మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబరు 31 తేదీ అనంతరం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. సచివాలయం, శాసన పరిషత్, హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఇప్పటి వరకూ షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించింది ప్రభుత్వం. 2021 నవంబరు 1 తేదీ నుంచి  ఉద్యోగులెవరికీ ఉచిత వసతి వెసులుబాటు ఉండబోదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. దీనితో ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి హైలెట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap