భారత్ చైనా సరిహద్దుల్లో వాతావరణం చాలా ఇబ్బందికరంగా మారింది కొన్నాళ్ళ నుంచి. గత ఏడాది చైనా సైనికులు దాడులు చేసి భారత సైనికులను హతమార్చడం సంచలనం అయింది. దీనిపై అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో చైనా తీరుని ఖండిస్తూ అండగా నిలబడింది భారత్ కు. ఇప్పుడు చైనా సరిహద్దుల వెంట మరోసారి చెలరేగిపోయింది. అరణాచల్ ప్రదేశ్ దేశ సరిహాద్దు వద్ద ఉద్రీక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇండియా - చైనా జవాన్ల మద్య తోపులాట జరిగిందని తెలుస్తుంది.

వారం రోజుల క్రితం  జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది నేడు. సరిహద్జు రేఖ వద్ద ప్రోటోకాలింగ్ చేస్తున్న సమయంలో ఎదురు ఎదురు పడ్డ ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు అని తెలిసింది. అదేసమయంలో తమ నియంత్రణ రేఖ దాటి వచ్చారంటు పరస్పరం తోపులాట కూడా చేసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాలకు సంబందించిన కమాండర్ స్థాయి జవాన్లు చర్చల తర్వాత గొడవ సద్దుమనిగింది అని పేర్కొన్నారు.

ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చైనా జవాన్ల కంటే మన జవాన్లే ఎక్కువ  అని అధికారులు వెల్లడించారు. తోపులాటలో ఎవరికి ఏం కాలేదని భారత ఆర్మీ అధికారులు జాతీయ మీడియాకు వివరించారు. రెండు దేశాల మద్య ఉన్న ఒప్పందాలకు తాము కట్టుబడి ఉన్నామన్న భారత సైన్యం... అరుణాచల్ ప్రదేశ్ - చైన సరిహాద్దు దగ్గర ఇంత వరకు అధికారికంగా ఎలాంటి సరిహద్దు రేఖ లేదు అని స్పష్టం చేసింది. ఇరుదేశాలు తమ సరిహద్దు రేఖను నియంత్రించుకున్నాయి అని ఆర్మీ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ తమ ప్రాంతానికి చెందినది అని చైనా అంటున్న సంగతి విదితమే. ఇదే ప్రాంతలో 2011,2016 లో ఈ తరహా చొరబాట్లకు చైనా పాల్పడింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చైనా సరిహాద్దు వద్ద భద్రత కట్టు దిట్టం చేసింది భారత రక్షణ శాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి: