అబద్దాలనే డిబేట్లుగా ప్రచారం చేయడం పచ్చ చానళ్లు, పచ్చ పత్రిలను చూస్తాం అంటూ విమర్శించారు. చివరకి సిఎం నే బోష్ డికే (లం.. కొ)అనే స్థాయికి దిగజారారు అని ఆయన ఆరోపించారు. నేడు ఇలాంటి వారిని ఎదుర్కొని ప్రజల కోసం మంచి పాలన అందిస్తున్నా అని అన్నారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉప ఎన్నికలలో అధికార పార్టీ కి అఖండ విజయం అందించారు అని ఆయన కొనియాడారు. ఇక అధికారం రాదనే దుగ్ధతో ఏపీ పై విషం చిమ్ముతున్నారు అని విమర్శలు చేసారు. రాష్ట్రం లో డ్రగ్స్, గంజాయి సరఫరా అంటూ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు ఆయన.
మీరు చేసేది సిఎం మీదే కాదు.. ఏపీ ప్రజల పై చేస్తున్న దాడి అని మండిపడ్డారు. ఇది అధర్మం, అనైతికం, పచ్చి అబద్దం అని ఆవేదన వ్యక్తం చేసారు. కేంద్రం దర్యాప్తు బృందాలు, విజయవాడ సిపి, డిజిపి ఇది అబద్ధం అని ఆదారాలతో చూపించారు అని అయినా క్రిమినల్ మైండ్ తో రాష్ట్ర యువత పై కళంకిత ముద్ర వేస్తున్నారు అంటూ విమర్శించారు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రధాన ప్రయారిటీ... తన, మన బేధం వద్దు అని స్పష్టం చేసారు. పౌరుల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు అని పోలీసులకు స్పష్టం చేసారు. బడుగు, బలహీన వర్గాల పై దాడి చేస్తే చట్టం ముందు నిలబెట్టాలి అని ఆయన ఆదేశించారు. సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు ఉక్కు పాదం మోపండి అని కోరారు.