ఏపీ రాజ‌కీయాల్లో నేత‌లు ఎప్పుడు ఎవ‌రి వైపు ఉంటారో ? ఈ రాజ‌కీయాలు ఎలా ట‌ర్న్ అవుతాయో ? కూడా ఎవ్వ‌రూ ఊహించ‌లేని ప‌రిస్థితి. ఏపీలో ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఎవ‌రు ఎటు జంప్ చేస్తారో ? కూడా అర్థం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే చాలా మంది సీనియ‌ర్ నేత‌లు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆ త‌ర్వాత కూడా సైకిల్ పార్టీని వ‌దిలేసి వ‌చ్చి వైసీపీలో చేరారు. ఎన్నిక‌ల కు ముందు టీడీపీ ని, చంద్ర‌బాబును తిట్టేందుకు వైసీపీ వీళ్ల‌ను ఓ రేంజ్‌లో వాడుకుంది. పార్టీ గెలిస్తే త‌మ‌కు ఏదైనా ప‌ద‌వి , గుర్తింపు వ‌స్తాయ‌ని ఆ పార్టీ మారిన వాళ్లు కూడా వైసీపీ వాళ్లు చెప్పింది చెప్పిన‌ట్టు చేశారు.

అయితే ఇప్పుడు వైసీపీ అధికారం లోకి వ‌చ్చి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది. అయితే ఇప్పుడు వీరిని ప‌ట్టించుకునే వాళ్లు ఎవ్వ‌రూ లేరు స‌రిక‌దా ?  వారి పొలిటికల్ లైఫ్ లో ఎలాంటి వెలుగులూ లేకుండా పోయాయ‌ని వారు తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. ఇక ఇప్పుడు 2024 ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయి. జ‌గ‌న్‌కు కూడా వీరిని ప‌ట్టించుకునే తీరిక లేకుండా పోయింది.

వీరంతా మ‌రో యేడాది పాటు వెయిట్ చేసి చూశాక ఆ త‌ర్వాత మళ్లీ టీడీపీ గూటికే వెళ్లి పోయేందుకు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నార‌ట‌. జ‌గ‌న్ చాలా మందికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన వారికి ఎడాపెడా ఎమ్మెల్సీ ల‌ను చేస్తాన‌ని హామీ లు ఇచ్చారు. అయితే ఇప్పుడు వారికి క‌నీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ట‌.

ఈ లిస్టులో ఉత్త‌రాంధ్ర నుంచి మొద‌లు పెట్టి గోదావ‌రి జిల్లాలు కృష్ణా, గుంటూరు తో పాటు అటు సీమ వ‌ర‌కు చూస్తే ఈ లిస్ట్ లో ఓ 40 మంది వ‌ర‌కు ఉంటార‌ని అంటున్నారు. వీరిని జ‌గ‌న్ ప‌ట్టించు కోక పోతే ఎన్నిక‌ల కు యేడాది ముందు నుంచే వీరంతా రివ‌ర్స్ జంప్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: