అమరావతి : జాతీయ వ్యవసాయ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు.  రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు.. అదే రేంజ్ లో వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గతం లో
భారత దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ ఉండేదని... రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడు.
ఈ రోజు రైతు పడే కష్టాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు.


దుక్కిదున్ని, విత్తనం నాటి, పంటను అమ్మి డబ్బు చేతకొచ్చే వరకు  ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు రుణాల కోసం, మరో రోజు విత్తనాల కోసం, ఇంకో రోజు ఎరువుల కోసం, చివరకు పంటను అమ్ముకోవడం కోసం, తరువాత ధాన్యం డబ్బుల కోసం రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వసాయం, పంటలకు కనీస మద్ధతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు చంద్రబాబు నాయుడు.

 ఏపీలో 93 శాతం మంది రైతులు రుణ భారం లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.  వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి వెంటనే నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.పీవీ గురించి మాట్లాడితే ఆర్థిక సంస్కరణలు గుర్తుకు వస్తాయని.. పీవీ నరసింహారావు చివరి రోజుల్లో ఆయనకు తగిన గౌరవం దక్కలేదన్నారు.పీవీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన గొప్పతనాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నామని..  అదే విదంగా ఢిల్లీలోని ఒక రోడ్డు కి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp