ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉంటే..మరికొన్ని నియోజకవర్గాలు మాత్రం టీడీపీకి అంతగా కలిసొచ్చేవి కాదు..జిల్లాలో సగం సగం అన్నట్లు టీడీపీ పరిస్తితి ఉంది. ఇదే క్రమంలో చీరాల నియోజకవర్గంలో కూడా టీడీపీ అంతగా సత్తా చాటిన సందర్భాలు తక్కువ. ఇక్కడ ఎక్కువసార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 1983, 1985 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ జెండా ఎగిరింది. మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో గెలిచింది.

ఆ తర్వాత 2004, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. కానీ 2019 ఎన్నికల్లో అనూహ్య రీతిలో సీనియర్ నేత కరణం బలరాంని బరిలో దించడంతో టీడీపీ మంచి మెజారిటీతో గెలిచింది. అయితే 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చి పనిచేశారు. 2019 ఎన్నికల ముందు మాత్రం వైసీపీలోకి జంప్ చేసి...చీరాల బరిలో నిలబడ్డారు. దీంతో చంద్రబాబు, కరణంని బరిలో దించారు. విజయం కరణంని వరించింది. ఇలా 1999 తర్వాత చీరాలలో టీడీపీ గెలిచింది.

కానీ గెలిచిన ఆనందాన్ని కరణం ఎక్కువ కాలం ఉండనివ్వలేదు. ఆయన నెక్స్ట్ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో చీరాలలో టీడీపీకి ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన యడం బాలాజీని ఇంచార్జ్‌గా పెట్టారు. ఆయనే చీరాలలో టీడీపీని నడిపిస్తున్నారు. కానీ వైసీపీకి ధీటుగా మాత్రం టీడీపీని నిలబెట్టలేకపోతున్నారు.

చీరాల వైసీపీలో లుకలుకలు ఉన్నా సరే వాటిని ఉపయోగించుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. దీంతో చంద్రబాబు, చీరాల ఇంచార్జ్‌ని మార్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లని మార్చుకుంటూ వస్తున్నారు. అయితే చీరాల సీటు ఫిక్స్ చేయించుకోవడానికి యడం బాలాజీ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మామూలుగానే యడం..వంగవీటి రాధా ఫాలోవర్..ఆయన సపోర్ట్‌తో సీటు సాధించాలని చూస్తున్నారు. మరి చూడాలి చంద్రబాబు, చీరాల సీటుని బాలాజీకి ఫిక్స్ చేస్తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: