అవును మీరు చదివింది నిజమే. నమ్ముకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి షాకివ్వటం ఏమిటని ఆలోచిస్తున్నారా ? వచ్చే ఎన్నికల్లో టికెట్లిచ్చే విషయంలో జగన్ చాలా కఠినంగా ఉండబోతున్నారు. పైగా 2024 ఎన్నికలు జగన్ కు చాలా కీలకమైనవి. గెలుపు విషయంలో ఎలాంటి ఛాన్సు తీసుకోదలచుకోలేదు. అందుకనే తాను నమ్మినవాళ్ళకు తప్ప వాళ్ళ వారసులకు టికెట్లిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. సమీక్షలో అందరిముందు చెప్పేశారు కాబట్టి వారసులను పోటీలోకి దింపాలని అనుకుంటున్న వాళ్ళందరికీ ఒకేసారి సమాధానం చెప్పినట్లయ్యింది.


మంత్రులు, ఎంఎల్ఏలతో జరిగిన సమీక్షలో జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా తేల్చిచెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో వారసులకు నో ఛాన్స్ అని. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో తమబిడ్డలు తిరుగుతున్నారని కొందరు జగన్ తో చెబుతున్నారట. ఈ విషయాన్ని జగన్ ప్రస్తావిస్తు ‘బిడ్డలు తిరుగుతున్నారు కాబట్టి తాము తిరగక్కర్లేదని మంత్రులు, ఎంఎల్ఏలు అనుకుంటున్నారు అయితే అదేమీ కుదరదు’ అని జగన్ చెప్పేశారు. కావాలంటే మీ బిడ్డలను ప్రమోట్ చేసుకోండి అభ్యంతరం లేదుకానీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరే పోటీచేయాలి అని తేల్చేశారు.


పేర్నినాని, దాటిశెట్టి రాజా లాంటి వాళ్ళు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లివ్వమని అడిగారట. దానికి తాను నో చెప్పినట్లు కూడా జగన్ చెప్పేశారు. కష్టాల్లో ఉన్నపుడు చాలమంది తనతో చేయిపట్టుకుని తిరిగిరాని వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి కాబట్టి వారసులు కాకుండా సీనియర్లే పోటీచేయాలన్నారు. నాని, దాడిశెట్టితో పాటు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారామ్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, శెట్టిపల్లి రఘునాధరెడ్డి, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి లాంటి కొందరు వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లివ్వాలని అడుతున్నారట.


వారసులకు నో ఛాన్సని అందరిముందు జగన్ తేల్చేశారు. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తిలేదు కాబట్టి కొడుక్కి టికెట్ ఇవ్వాలని పేర్నినాని సమీక్షలోనే అడిగారు. అందుకు జగన్ అంగీకరించలేదు. ‘లేదు లేదు వచ్చే ఎన్నికల్లో నువ్వే పోటీచేయాలి, కొడుక్కి టికెట్ ఇవ్వటం కుదరదు’ అని జగన్ కూడా గట్టిగానే చెప్పారు. బహుశా వయసును దృష్టిలో పెట్టుకుని జగన్ ఎవరికైనా మినహాయింపిస్తే ఇవచ్చని అనుకుంటున్నారు. కాబట్టి వారసులు ఆశలు వదులుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: