అయితే ఇక్కడ చైనా, జపాన్ ఒకటి కాదు. అయితే ఇప్పుడు జపాన్ లోని కొన్ని దీవులు తనవేనని అంటుంది చైనా. జపాన్ కు సంబంధించిన సుకోవి దీవులు తనవే అని అంటుంది చైనా. అవి మాత్రమే కాకుండా జపాన్ లోని మరికొన్ని దీవుల పై కూడా ఇప్పుడు చైనా బాంబర్లు విహరించాయని అంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన జపాన్ తన యుద్ద హెలికాప్టర్లను పంపించి చైనా దేశానికి హెచ్చరికలను జారీ చేసింది.
చైనా బాంబర్లు అలాగే ఒకినావా, తైవాన్‌ల డ్రోన్‌లను ఛేదించే క్రమంలో జపాన్ తాను యుద్ధానికి సన్నద్ధమైంది. ఒకినావా ఇంకా మియాకు దీవుల మధ్య ఉన్న ప్రాంతంలో రెండు చైనీస్ హెచ్ 6 బాంబర్లను గుర్తించినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా తమ గగన తలంలో తమ అనుమతి లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న చైనా డ్రోన్‌లను పర్యవేక్షించేందుకు తమ విమానాలను పంపినట్లు జపాన్ మిలిటరీ తెలిపింది.
ఒక దేశపు గగనతలంలోకి వారి అనుమతి లేకుండా విహరించడమే తప్పు. అలాంటిది జపాన్ అనుమతి లేకుండా జపాన్ గగనతలం పైన యుద్ధ విమానాలు విహరించడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయింది. చైనా జపాన్ ఇంకా తైవాన్ మధ్య ఉండే దీవుల పైకి చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు వచ్చాయని తెలుస్తుంది. ఇది గమనించిన జపాన్ ఈ యుద్ధ విమానాలు అసలు తమ కోసం వచ్చాయా లేదంటే తైవాన్ కోసం వచ్చాయా అని ఆరా తీస్తుంది ఇప్పుడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి