సాగునీటి రంగాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కొన్ని విషయాలు కావాలనే చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతి లేకుండానే కట్టుకున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 840 అడుగుల పైన ఉంటే దాన్ని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యూలేటరీ ద్వారా రాయలసీమకు నీటిని పంపించుకోవచ్చు.


అయితే 800 అడుగుల లోపే ఉన్న ఆ నీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ తీసేసుకుంటుంది. అయితే దీనిపై కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరకు వెళితే దానికి మాకు ఏం సంబంధం లేదని తెలిపింది. వాస్తవంగా ఈ విషయంలో ఎఫెక్స్ కమిటీ దగ్గరకు వెళ్లి అడగాలి. అయితే హంద్రీనీవా విషయంలో కేసీఆర్ సర్కారు అడ్డు పడుతుంది. దీనిపై కోర్టుల్లో కేసులు పెడుతుంది.


దాదాపు 790 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోసుకుంటున్న తెలంగాణ సర్కారుపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక ఏం కారణాలు ఉన్నాయనేది ఎవరికీ తెలియడం లేదు. హంద్రీనీవా విషయంలో తెలంగాణ మౌనంగా ఉండాలని ఏమైనా ఒప్పందం చేసుకున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణలోని పాలమూరు జిల్లాకు కృష్ణా నీరు రావడంపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం దీనిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.


జగన్ సర్కారు నిర్లక్ష్యంతోనే కేసీఆర్ అతి తక్కువ నీరు ఉన్నా సరే దాన్ని ఎత్తిపోస్తూ అనుమతులకు తిలోదకాలు ఇస్తున్నారని మండి పడుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఆంధ్ర ప్రదేశ్ సర్కారు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర సర్కారు తీసుకునే నిర్ణయం గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద కృష్ణా నీటిని పాలమూరుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: