ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల తెలుగు లో మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నారు. దీని కోసం ఆయన చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ముఖ్యంగా హిందీలో తెలుగు పదాలను రాసుకుని వాటిని ప్రాక్టీస్ చేసి సభల్లో మాట్లాడారు. ఇది అంతా ఈజీ కాదు నార్త్ ఇండియా నుంచి వచ్చే నాయకులకు తెలుగు మాట్లాడటం అంటే చాలా ఇబ్బందికరమైన అంశం.


కానీ బీజేపీ మీటింగ్ లలో ప్రధాని  ఎక్కడా కూడా తగ్గకుండా తెలుగు మాట్లాడటానికి ప్రయత్నం చేయడం జనాల్ని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం కేవలం హిందీలో నే ప్రచారం చేయడం ప్రజలకు చాలా మందికి అర్థం కావడం లేదు. అనువాదకుడిని పెట్టుకుని స్పీచ్ ను కానిచ్చేశారు. దీంతో రాహుల్ ఏమీ మాట్లాడుతున్నారో సామాన్య ప్రజలకు తొందరగా తెలుసుకోలేకపోతున్నారు.


ఢిల్లీ నుంచి వచ్చిన  బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వారి ప్రసంగాలు మొత్తం హిందీలో నే కొనసాగాయి. కానీ నరేంద్ర మోదీ మాత్రం అక్కడక్కడ తెలుగులో ప్రసంగించడం మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఒక ప్రధాని హోదాలో ఉండి కూడా ఇంత టైమ్ ఆయనకి ఎలా దొరుకుతుందో తెలియక అందరూ ఆశ్యర్యపోతున్నారు. కాబట్టి దక్షిణ భారత దేశంలో ప్రచారం చేసేందుకు వస్తున్న నాయకులు తమ పార్టీల హామీలు చెప్పడానికి తెలుగు భాష లో మాట్లాడితే ఇక్కడి ప్రజలు సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు.


మధ్యలో ఒక అనువాదకుడు అవసరం లేకుండా సభ జరిగినపుడు చాలా సింపుల్ గా సభ జరిగిపోతుంది. కానీ ఈ విషయంలో రాహుల్ మోదీ కంటే వెనకబడ్డాడనే చెప్పొచ్చు. ప్రతి స్పీచ్ లో రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి అమిత్ షా హిందీలోనే ప్రసంగించారు. ఈ ప్రసంగాల ప్రభావం తెలంగాణ ప్రజల మీద ఏ మేరకు ఉండనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: