మూడుపార్టీలు టీడీపీ,జనసేన,బీజేపీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మూడుపార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత ఇష్టమున్నా లేకపోయినా  పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే. అయితే మూడుపార్టీల మధ్య విచిత్రమైన డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. ఈ పరిణామాలను చూసిన తర్వాత ఇవేమి డెవలప్మెంట్లని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. విషయం ఏమిటంటే బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి టీడీపీలో చేరారు. చంద్రబాబునాయడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. బహుశా ఈమె  నంద్యాల ఎంపీగా టీడీపీ తరపున పోటీచేయవచ్చు. ఎంపీ టికెట్ హామీతోనే శబరి పార్టీ మారారు.





టీడీపీ నేతలు జనసేనలో చేరుతున్నారు. బీజేపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ నేతలు ఆల్రెడీ బీజేపీ, జనసేనలో చేరున్నారు. మామూలుగా రెండు లేదా మూడుపార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ఒకపార్టీలో నుండి మరోపార్టీలోకి జంపింగులను ఎలౌచేయరు. ఎందుకంటే మూడుపార్టీల్లో ఎవరు ఎక్కడున్నా ఒకటే కాబట్టి. ఈ మూడుపార్టీలకు ప్రత్యర్ధి అయిన వైసీపీ, కాంగ్రెస్ లో నుండి వస్తే చేర్చుకోవటం, లేకపోతే కూటమిలోని మూడుపార్టీల్లోని నేతలు ఇతర పార్టీల్లోకి చేరటంలో తప్పులేదు. కాని కూటమిలోని పార్టీల మధ్యే నేతల గోడదూకుళ్ళు ఏమిటో అర్ధంకావటంలేదు.





టీడీపీ మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులును అధినేత పవన్ కల్యాణ్ జనసేనలో చేర్చుకున్నారు. పులపర్తి భీమవరం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీచేయబోతున్నారు. జనసేనలో ఎవరూ లేనట్లుగా టీడీపీ నేతను  చేర్చుకుని పవన్ టికెట్ ఇస్తుండటమే చాలా విడ్డూరంగా ఉంది. అలాగే టీడీపీలో ఎవరూలేనట్లు బీజేపీ నేత బైరెడ్డి  శబరిని టీడీపీలో చేర్చుకుని నంద్యాల ఎంపీగా టికెట్ ఇస్తుండటాన్ని అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. జనసేనలో అంటే నేతలు లేరు కాబట్టి ఇతర పార్టీల  నుండి చేర్చుకుని టికెట్లిస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.





కాని 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే టీడీపీకి ఏమైంది ? బీజేపీ నేతను తీసుకుని ఎంపీ టికెట్ ఇవ్వటానికి. అంటే నేతల కొరతతో టీడీపీ అంత ఒట్టిపోయిందా ? మూడు పార్టీలు పొత్తుపెట్టుకున్నాక కూడా అధినేతలు పార్టీలు మారుతున్న నేతలను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అర్ధంకావటంలేదు. కూటమిలోని పార్టీల మధ్య నేతల గోడదూకుళ్ళు బహుశా ఏపీలోనే జరుగుతున్నాయోమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: