ఆంధ్రప్రదేశ్లో బిజెపి వైసిపి మధ్య ప్రత్యక్ష పొత్తులు లేనప్పటికీ పరోక్షంగానే పొత్తులు ఉన్నాయని చాలా మంది రాజకీయ నాయకులూ కూడా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో టిడిపి జనసేన బిజెపి పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకొని సీట్ల పంపకాలు కూడా చేసుకున్నారు. ఇలాంటి సమయంలో కూడా జగన్ పైన పెద్ద ఎత్తున మోడీ సర్కార్ విమర్శలు చేస్తుందని అందరూ అనుకున్నారు. అటు టిడిపి జనసేన కార్యకర్తలు కూడా అనుకున్నప్పటికీ అలాంటివేమి జరగలేదు.. బిజెపి నేతలకు కూడా జగన్ పాలనను చూసి ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు.


దీన్ని బట్టి చూస్తే అటు వైసిపి పార్టీకి బిజెపి పార్టీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి రావలసి నటువంటి నిధుల విషయంలో పాటు విశాఖ ప్రైవేటీకరణ అంశంలో కూడా ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రశ్నించలేదు.. ఒకానొక సమయంలో వైసీపీ పార్టీ ఎన్డీఏలో చేరుతుందని వార్తలు కూడా వినిపించాయి కానీ అలాంటిదేమీ జరగలేదు చివరికి టిడిపి బిజెపి జనసేన పొత్తులు కుదుర్చుకున్నాయి.


దీంతో ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వ పైన ఎలాంటి విమర్శలు చేయని సీఎం జగన్ ఇకపై కేంద్రం పైన కూడా ఎలా వ్యవహరిస్తారనే విషయం ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.. అటు బిజెపి పెద్దలు కూడా జగన్ పాలన పైన పెద్దగా ఎక్కడ విమర్శించలేదు. నిన్నటి రోజున చిలకలూరిపేటలో కూడా జరిగిన సభలో టిడిపి జనసేన కాస్త విమర్శించినప్పటికీ మోడీ మాత్రం అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం వైసీపీ పార్టీ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే విధంగానే కనిపిస్తోంది. మరి ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ విజయకేతాన్ని ఎగరేస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: