ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారానికి పెట్టింది పేరని చెప్పవచ్చు..ప్రకాశం జిల్లాలో ఈసారి ఎన్నికల పోటీ అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను పోటీకి దింపాయి. చీమకుర్తి గ్రానైట్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ వుంది..తరాల తరబడి తవ్వినా తరగని గనులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్క ఎకరంలో గ్రానైట్ క్వారీ పడిందంటే చాలు కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. అలాంటిది వందల ఎకరాలు విస్తరించి ఉన్న గ్రానైట్ క్వారీలు కలిగి ఉన్న యజమానులే ఇక్కడ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. జిల్లాలోనే గ్రానైట్ కింగ్ గా పేరు గాంచిన గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి అద్దంకి ఎమ్మెల్యేగా పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లోనూ తెలుగుదేశం నుంచి గెలుపొందిన ఆయన ఈసారి కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల సంఘానికి గొట్టిపాటి రవి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.58.38 కోట్లు ఉంది. వివిధ బ్యాంకుల్లో ఉన్న క్యాష్, బాండ్లు, షేర్లు, పర్సనల్ లోన్ అడ్వాన్స్ అన్నీ కలిపి రూ.18 కోట్లు ఉన్నాయి. వంద ఎకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి విలువ రూ.ఎనిమిదిన్నర కోట్లు వరకు ఉంది. ఈ భూముల్లోనే ఆయన గ్రానైట్ క్వారీలు కూడా ఉండటంతో వాస్తవంగా వీటి విలువ రూ.వేల కోట్లలోనే ఉంటుందని సమాచారం..అలాగే వివిధ బ్యాంకుల నుంచి రవి తీసుకున్న అప్పు మరో రూ.13 కోట్లుగా ఉంది.

మరో గ్రానైట్ వ్యాపారి శిద్దా రాఘవరావు కూడా రూ.వంద కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టారు. ఆయన బ్యాంకు బ్యాలెన్స్ డిపాజిట్లు కలిపి రెండున్నర కోట్లు ఉండగా...బాండ్లు, షేర్ల రూపంలో మరో రూ.22 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తం చరాస్తుల విలువ రూ.31 కోట్లు ఉండగా....వ్యవసాయ భూమి విలువ రూ.15 కోట్లు ఉంది. ఈ భూముల్లోనే ఆయన గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటి విలువ కూడా రూ.వందల కోట్లు ఉండే అవకాశం ఉంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 18.50 కోట్లు ఉంది.వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆస్తి రూ.4 కోట్లు పైనే ఉండగా... అప్పులు బాలినేనిపై పోటీ చేసి ఓడిపోయిన తెలుగుదేశం నేత దామచర్ల జనార్థన్ ఆస్తులు దాదాపు రూ.వంద కోట్ల వరకు ఉండటం విశేషం. అప్పులు కేవలం రూ.66 లక్షలు మాత్రమే ఉన్నాయి. మంత్రి మేరుగ నాగార్జునకు రూ.57 లక్షల విలువైన ఆస్తులతో పాటు రూ.50 వేల విలువైన అప్పులు ఉన్నాయి. మరో మంత్రి ఆదిమూలపు సురేశ్ కు రూ.16 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా... దాదాపు రూ.4 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: