పొత్తులో భాగంగా తిరుపతి సీటు ఈసారి జనసేన పార్టీకి దక్కించుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని పవన్ కళ్యాణ్ ఇటీవలే ప్రకటించారు. దీంతో టిడిపి సీనియర్ నేత సుగుణమ్మ కూడా చాలా అసంతృప్తిని వెల్లడిస్తోంది.. అయినప్పటికీ కూడా ఆరణి శ్రీనివాసులు మాత్రం తిరుపతి ఎన్నికల ఏర్పాటు చేసుకుని పనిలో ఉన్నారు. దీంతో ఈయనని అడ్డుకోవడానికి టిడిపి జనసేన నాయకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ బెదిరింపులకు పవన్ కళ్యాణ్ మాత్రం భయపడకుండా ఆరణి శ్రీనివాసుల్ని తమ అభ్యర్థి అంటూ తేది చెప్పేశారు.


దీంతో చాలామంది టీడీపీ జనసేన అభ్యర్థులు మద్దతు కూడా పలకడం లేదట. ముందుగా తమ పార్టీ నాయకులు అసంతృప్తితో చల్లారించేందుకు ఆరణి శ్రీనివాసులు అందరిని కలుసుకుంటున్నారు..ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మాత్రం పార్టీకి అనుగుణంగానే ఆరణి వెంట నడుస్తూ ఉన్నారు. మరొక పెద్ద లీడర్ జనసేన లో ఉన్నారట.. రాయల్ ఫ్యామిలీ అయినప్పటికీ మద్దతు విషయంలో ఒక న్యూస్ తిరుపతి ప్రచారం అవుతున్నట్లుగా ఒక విషయం వినిపిస్తోంది..


అదేమిటంటే ఈసారి తనకు టికెట్ ఇవ్వలేదని.. కానీ నీకు ఇచ్చారని అందుకే తిరుపతికి వచ్చా తిరుపతిలో జనసేన జెండా ఇద్దరం కలిసి ఎగరేద్దాం అంటూ ఆ రాయల్ లీడర్ ఆరణి శ్రీనివాసుల్ తో అన్నారట.. వైసీపీ నుంచి బయటకు వచ్చి టికెట్ తెచ్చుకున్నావ్ ఇదంతా బాగానే ఉంది.. కానీ తన మద్దతు కావాలంటే కొన్ని షరతులు ఉన్నాయని చెప్పారట.. ఏంటా అంటూ ఆరణి అడగగా.. ఐదేళ్లుగా పార్టీ కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ తనకి ఏమీ ఇవ్వలేదని దాదాపుగా 7 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని టికెట్ వస్తుందని ఆశ కూడా ఉండేది కానీ తనకు టికెట్ ఇవ్వలేదు.. మీరు అధికార పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు టికెట్ తీసుకున్నారు మరి నా సంగతేంటి నా కార్యకర్తల కోసం నేను చేసిన అప్పులు ఏంటి అంటూ ఆ అప్పుల కోసం కనీసం మూడు కోట్లు ఇస్తే తన మద్దతు ఉంటుందని ఈ మాట ఎవరికీ చెప్పుకున్న భయం లేదంటూ కూడా ఆరణి శ్రీనివాసుల్ని.. ఈ విషయం విని ఆశ్చర్యపోయానని దీనైతే తెలియజేశారు. కానీ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ కు అభిమాని అన్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటారట మరి ఈ విషయం పైన జనసేన అధినేత మరి ఈ విషయం పైన జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: