ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఏపీలో వ‌రుస‌గా మూడో ఎన్నిక‌ల్లో నూ బీజేపీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఆమె 2004లో గుంటూరు జిల్లా బాప‌ట్ల నుంచి, 2009లో బాప‌ట్ల ఎస్సీ కావ‌డంతో విశాఖ‌ప‌ట్నం నుంచి పోటీ చేసి వ‌రుస‌గా రెండు సార్లు ఎంపీలుగా గెలిచారు. ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పురందేశ్వ‌రి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. 2014ల‌లో ఆమె రాజంపేట పార్ల‌మెంటు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019లోనూ ఆమె విశాఖ‌ప‌ట్నం నుంచి పోటీ చేసి వ‌రుస‌గా రెండోసారి ఓడిపోయారు. క‌ట్ చేస్తే ఇప్పుడు ఏపీలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో పురందేశ్వ‌రి అత్యంత సుర‌క్షిత‌మైన రాజ‌మండ్రి పార్ల‌మెంటు సీటు నుంచి పోటీలోకి దిగుతున్నారు. పురందేశ్వ‌రి పొత్తులో ఇక్క‌డ పోటీ చేస్తుండ‌డంతో ఆమె గురించి నియోజ‌క‌వ‌ర్గంలో పాజిటివ్ చ‌ర్చ జ‌రుగుతోంది. రాజమహేంద్రవరం కు ఒక అద్భుత అవకాశం వచ్చింది ప్రపంచ మేధావి ఆర్థిక వేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీగారు, బిజెపి ముఖ్యులు పార్టీలకు అతీతంగా మన్ననలు పొంది ఆమె చేసిన పదవికి వన్నె తెచ్చార‌నే అంటున్నారు.

అలాగే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, దివంగ‌త నందమూరి తారకరామారావు గారి కుమార్తె కావ‌డం, అభివృద్ధి విష‌యంలో ఆమెకు మంచి విజ‌న్ ఉండ‌డంతో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగా గుర్తించి అందరూ తమ ఓటు వేసి పార్లమెంటుకు పంపితే రాజమండ్రిలో పెండింగ్ ప్రాజెక్టులు, 2027 లో రానున్న గోదావరి పుష్కరాలను వైభవంగా జరపటానికి ఎంతో ఉపయోగం ఉంటుంద‌న్న చ‌ర్చ‌లే ఎక్కువుగా న‌డుస్తున్నాయి.

అన్నీ బాగానే ఉన్నా అన‌ప‌ర్తి సీటు వ‌ల్లే 2009లో ముర‌ళీ మోహ‌న్ స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అన‌ప‌ర్తి సీటును బీజేపీకి ఇచ్చారు. ఇక్క‌డ బీజేపీ గ‌ట్టి పోటీ ఇవ్వ‌క‌పోతే అక్క‌డ నుంచి వ‌చ్చే భారీ మెజార్టీ తో పార్ల‌మెంటు ఫలితంపై ప్ర‌భావం ప‌డుతుంద‌న్న ఆందోళ‌న ఉంది. మ‌రి దీని నుంచి పురందేశ్వ‌రి ఎలా గ‌ట్టెక్కుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: