ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగార మ్రోగింది.. ఇటు అధికార పార్టీ నుంచి అటు ప్రతి పక్ష పార్టీ నుంచి తమకే టికెట్ దక్కుతుందని అనుకోని బంగపడ్డ ఆశావాహులు చాలా మంది వున్నారు..అయితే టికెట్ రాని నేతలను ఇరు పార్టీ అధిష్టానాలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయి.. అయితే ఈ సారి టికెట్ తమకే వస్తుందని భావించిన పనబాక కుటుంబానికి టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది.. రాజకీయాలలో సుధీర్ఘకాలంగా వున్న ఆ కుటుంబం ఈ సారి ఎన్నికల బరిలో లేదు.. ఐదు సార్లు ఎంపీ గా అనుభవం వున్నా నమ్మించి ద్రోహం చేసారని పార్టీ నాయకత్వంపై పనబాక కుటుంబం ఆగ్రహంలో వుంది.. ఎంపీ గా, కేంద్రమంత్రిగా  రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన మహిళా నేత కథ రివర్స్ అయింది.. సీట్ కన్ఫర్మ్ అనుకున్న పొలిటికల్ కపుల్ కి టీడీపీ షాక్ ఇచ్చింది.. నెల్లూరు జిల్లాలో సుధీర్ఘ కాలంగా రాజకీయాలలో కొనసాగుతున్న వారిలో పనబాక దంపతులు కూడా వున్నారు.1991 లో పనబాక లక్ష్మి పాలిటిక్స్ లోకి వచ్చారు.. 

నెల్లూరు నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున ఎంపీ గా విజయం సాధించారు.2009 లో పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య గూడూరు నుంచి పోటీ చేశారు.. కాంగ్రెస్ తో సుధీర్ఘ కాలం అనుబంధం నేపథ్యంలో 2014 పరిణామాలు తరువాత కూడా అదే పార్టీలో కొనసాగారు.రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ బలహీనపడటంతో 2021లో టీడీపీలో చేరి తిరుపతి ఎంపీ ఉపఎన్నికల్లో పోటీ చేశారు పనబాక లక్ష్మి..ఆ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అసలు ఆసక్తి లేకపోయిన టీడీపీ అధినేత తమని ఒప్పించి పోటీ చేయించారని పనబాక దంపతులు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా సీటు దక్కుతుందనుకున్న పనబాక దంపతులకి టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఇద్దరికీ టిక్కెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారని అంటున్నారు పనబాక దంపతులు.. సూళ్లూరుపేట టికెట్ పై చివరి దాక ఆశలు పెట్టుకున్నామని అది లేకుంటే పార్లమెంట్ సీటు అయిన దక్కుతుందని అనుకుంటే చివరికి ఇలా చేసారని ఆవేదనతో పనబాక దంపతులు వున్నారు..30 ఏళ్లుగా ఎన్నికలలో పోటీ చేస్తున్న తమకు ఈ సారి సీటు దక్కకపోవటంతో వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్న్తార్ధకంగా మారింది..ఈ పరిస్థితికి టీడీపీనే కారణం అని వారు ఆవేదన చెందుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: