మాజీ మంత్రి వైయస్ వివేకానంద మరణం అటు ఆంధ్రాలో చాలా రసవత్తంగా మారుతోంది.ముఖ్యంగా అంతకుడు ఏపీలోని ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్నాయని నిన్నటి రోజున బస్సు యాత్ర మొదలుపెట్టిన సీఎం జగన్ పొద్దుటూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడడం జరిగింది. వైయస్ వివేకాను ఎవరు చంపారో అందరకు తెలుసునని వివేక బాబాయ్ చంపిన హంతకులు శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్నారని వారికి మద్దతుగా చంద్రబాబు మనుషులు కూడా తెలుపుతున్నారంటూ సీఎం జగన్ నిన్నటి రోజున ఫైరయ్యారు.


ఇలాంటి వారి మద్దతు కోసం తన కుటుంబంలో కూడా రాజకీయ చిచ్చు పెట్టి చంద్రబాబు తన స్వార్థంతో తమ కుటుంబంలో కూడా చిచ్చులు పెట్టారని తెలిపారు.. తమ కుటుంబ సభ్యులు కూడా స్వార్థంతో రాజకీయాలకు తప్పించి పోతున్నారని గుర్తించిన చంద్రబాబు వీరిని పావుగా వాడుకున్నారని తెలిపారు.. ఆ హంతకుడుకు  మద్దతు ఇస్తున్నారని తెలియజేశారు.. తన చిన్నాన్నను అన్యాయంగా చంపిన వారిని కచ్చితంగా శిక్షిస్తానని ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టమంటూ సీఎం జగన్ నిన్నటి రోజున మేమంతా సిద్ధం సభలో తెలియజేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వ్యక్తులతోనే అందరూ చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు అంటూ పరోక్షంగా వైయస్ షర్మిల గురించి వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.


దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు పక్కా ప్లాన్ ప్రకారమే జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టారని వైసీపీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు.. అయితే ఇలాంటివన్నీ సీఎం జగన్ మాత్రం పట్టించుకోకుండా అందర్నీ కలుపుకొని ముందుకు వెళుతున్నారు.. అలాగే పేదల అభివృద్ధి కోసమే తాను కష్టపడుతున్నానని మే 13న ఫ్యాన్ గుర్తుపైన రెండు ఓట్లు వేసి మళ్లీ గెలిపించాలంటు తెలియజేశారు సీఎం జగన్.. మళ్లీ చంద్రబాబు తో పాటు అబద్ధాలు కుట్రలను మోసాలకు పాల్పడే పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయని తెలిపారు సీఎం జగన్.. ఒక్క జగన్ ను ఓడించడానికి ఇంతమంది ఏకమయ్యారు.. కానీ నా ధైర్యం ప్రజలే అంటూ తాను ఎప్పటికీ ఒంటరిగానే పోటీ చేస్తానంటూ తెలిపారు సీఎం జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: