ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముగిసాయి. వీటి ఫలితాలు జూన్ 4న ప్రకటించనున్నారు. అంటే 20 రోజులకు బాగానే సమయం ఉంది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్‌కు బ్రేకు దొరికినట్లు అయ్యింది. అందుకే ఆయన తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని సతీసమేతంగా విదేశాల్లో ఖాళీగా కలపడానికి లండన్ టూర్ వెళ్లారు. జగన్ ఫ్యామిలీతో సహా శుక్రవారం విజయవాడలో విమానం ఎక్కి లండన్ చెక్కేశారు. ఎలక్షన్ రిజల్ట్ డేట్ కి మూడు రోజుల ముందు అంటే జూన్ 1న ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ తిరిగి వస్తున్నారు.

 ఈ ఫ్యామిలీ టూర్‌లో భాగంగా జగన్ ఒక లండన్ మాత్రమే వెళ్లడం లేదు మిగతా దేశాలు కూడా వెళ్తున్నారు. అయితే ముందుగా ఆయన లండన్ లో పర్యటించి ఆ తర్వాతనే ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. జగన్ ఇద్దరు కుమార్తెలు ఇప్పటికే యూనివర్సిటీలో చదువుకొని మంచి నాలెడ్జ్ సంపాదించారు. వారు తమ తండ్రితో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ జగన్ అనేక విషయాలను తెలుపవచ్చు.

ఇదిలా ఉండగా జగన్ లండన్ టూర్‌కి ముందు ఎయిర్‌పోర్ట్‌లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. సీఎం విదేశీ పర్యటనకు బయలుదేరుతుండగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు జోగి రమేష్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్‌, ప్రభుత్వ విప్‌ లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌ కుమార్‌, మల్లాది విష్టు, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డిలు వంటి వైసీపీ కీలక నేతలందరూ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు జగన్ ఫ్యామిలీకి హృదయపూర్వకంగా  సెండాఫ్ ఇచ్చారు.

 ప్రేమతో వారిచ్చిన సెండ్ ఆఫ్ కారణంగా జగన్ ఎంతో సంతోషించారు. వారితో ఉత్సాహంగా గడుపుతూ కనిపించారు. జగన్ పై అక్రమాస్తుల కేసు ఉంది కాబట్టి విదేశాలకు వెళ్లేటప్పుడు ఆయన తప్పనిసరిగా సీబీఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. అందుకే టూర్ కు ముందు నాంపల్లి సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. అయితే కోర్టు వాదనాలను విని ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: