తెలుగుదేశం పార్టీ దీని పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది  సీనియర్ నందమూరి తారక రామారావు మాత్రమే. సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందిన సీనియర్ ఎన్టీఆర్ 1982 మార్చి 29న టిడిపి పార్టీ ని ప్రారంభించారు. ఆనాటి కాలంలో  కాంగ్రెస్ దేశమంతా పాలిస్తోంది. ఆ టైంలోనే sr. ఎన్టీఆర్  ప్రజలనంతా ఏకం చేసి పార్టీ పెట్టి 9 నెలలకే  పూర్తి స్థాయిలో అధికారంలోకి  వచ్చారని చెప్పవచ్చు. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పేద ప్రజల కోసం ఎన్నో ఉత్తమమైన పథకాలు తీసుకొచ్చి  పేదల ఆరాధ్య దైవంగా మారాడు. ఆ విధంగా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా ఆ ఫ్యామిలీకి దూరమైంది. చివరికి నారా చంద్రబాబు చేతిలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని లీడింగ్ చేస్తున్నారు.

 ఆ పార్టీకి బాస్ గా ఉన్నారు. పలుమార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో  చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2019లో వైసీపీ పార్టీ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ 2024లో వైసిపి,టిడిపి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.  రిజల్ట్ రావడానికి ఇంకా కొన్ని రోజుల టైం ఉంది కాబట్టి చాలామంది నేతలు పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇదే తరుణంలో  మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఒకవేళ సంబంధం ఉండేది ఉంటే ఆయన 2014, 2019,2024 ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వచ్చేవారని తెలిపారు.

ఆయనకు పార్టీతో సంబంధం లేకున్నా కానీ కొడాలి నాని, వల్లభనేని వంశీలు తరచూ ఆయన పేరు తీసుకువచ్చి ప్రజల్లో చులకన చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం వెంకన్న ఈ కామెంట్స్ చేయడంతో  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఎత్తి పొడుస్తున్నారు. టిడిపి అంటేనే నందమూరి ఫ్యామిలీది jr.ఎన్టీఆర్ తాతది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక టిడిపిని లీడ్ చేయడం చంద్రబాబు లోకేష్ తో కాదు  మళ్లీ మా అన్న ఎన్టీఆర్ వస్తేనే టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి టిడిపి నేతలు  ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కాని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ రాజకీయాలకు ఎలాంటి తావివ్వకుండా ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: