విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం సైతం దగ్గర పడుతున్న కొద్ది వైసిపి పార్టీకి సంబంధించి ఒక్కొక్కటిగా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తమ కార్పొరేటర్ లను సైతం కాపాడుకోవడానికి వైసిపి పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఫలితం లభించడం లేదట. కూటమి ప్రభుత్వం గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సైతం ఎలాగైనా దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇలాంటి సమయంలో వైసీపీ కార్పొరేటర్లు సైతం వరుసగా కూటమి వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు.


మేయర్ అవిశ్వాస పరీక్షకు ముందు వైసీపీ పార్టీకి ఇప్పుడు తాజాగా మరొకసారి షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేసిన ఆరవ వార్డుకి కార్పొరేటర్ గా ఉన్న లక్ష్మీ ప్రియాంక కూడా రాజీనామా కంటే ఈమె మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈమె వైసిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా లేఖ రాసి మరి గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల విషయంలో తాను వ్యక్తిగత కారణాలవల్ల వైసిపి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని లేఖ ద్వారా తెలిపిందట.


తనకు అవకాశం కల్పించినందుకు వైసిపి పార్టీ అధినేతకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తూ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక ఒక లేఖను పంపింది. అయితే మేయర్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రియాంక ఇప్పుడు ఇలాంటి పని చేయడంతో పాటుగా ఆమె ఏ పార్టీలోకి చేరుతారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నది. మరి కూటమి ప్రభుత్వం దక్కించుకోవాలనుకుంటున్న విశాఖ కార్పొరేటర్ పదవి ఏ విధంగా దక్కించుకుంటుందో చూడాలి మరి. మరి వైసీపీ పార్టీ తమ సంఖ్య బలాన్ని సైతం తగ్గించుకోకుండా ఏ విధంగా ముందుకు వెళ్తుందా చూడాలి. మొత్తానికి మాత్రం అటు ఏపీలో ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా చాలా రసవంతంగానే మారుతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: