
నారావారిపల్లె నుంచి మొదటిసారి అసెంబ్లీ దాకా :
* ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లి లో చంద్రబాబు పుట్టి పెరిగారు ..
* ఇక ఆయన చంద్రగిరి లోని ప్రభుత్వ పాఠశాలలో చదువును పూర్తి చేశారు ..
* చంద్రబాబు తండ్రి కర్జూరనాయుడు సాధారణ రైతు ..
* చిన్నతనం నుంచి చంద్రబాబు లెక్చరర్ , ఐఏఎస్ , బిజినెస్ మాన్ ఈ మూడింట్లో ఏదో ఒకటి కావాలని ఎన్నో కలలు కన్నవారు ...
* ఇక నారావారిపల్లె గ్రామపెద్దల్లో చంద్రబాబు తండ్రి కర్జూరనాయుడు కూడా ఒకరు .. అలా తన తండ్రి ప్రభావంతో చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వచ్చాయి ..
* తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలోనే విద్యార్థి సంఘ నాయకుడుగా చంద్రబాబు గెలిచారు..
* అలానే నారావారి పల్లె నుంచి పీజీ చేసిన రెండు వ్యక్తి కూడా చంద్రబాబే..
* రాజకీయాల్లోకి వెళ్తే ప్రజలకు సమాజానికి మంచి చేయవచ్చు అని యూనివర్సిటీలో చేరాకే చంద్రబాబుకు తెలిసింది ..
•ఎన్టీఆర్ , నాగేశ్వరరావు సినిమాలను చంద్రబాబు ఎంతగానో చూసేవారు ..
* వాలీబాల్ , ఫుట్బాల్ అంటే చంద్రబాబుకు ఇష్టమైన గేమ్స్..
* అలాగే చంద్రబాబు ఆర్ధిక శాస్త్రంలో పీజీ చేశాక .. అదే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేశారు .. అలాగే అక్కడే లెక్చరగా అవకాశం వస్తే దానికి నో చెప్పారు..
* అలా 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రబాబు చంద్రగిరి అసెంబ్లీ సీట్ వచ్చింది .. ఆ సమయానికి చంద్రబాబు చేతిలో డబ్బులు లేవు .. తండ్రిని డబ్బులు అడిగితే మనకెందుకురా రాజకీయాలు అని అన్నారు .. కానీ చివరకు చంద్రబాబుకు తన తండ్రి లక్ష రూపాయలు ఇచ్చారు ..
ఎమ్మెల్యే నుంచి మొదటిసారి సీఎం స్థాయి వరకు :
* ఇక 1980 -83 సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు ..
* ఇక సినిమాటోగ్రఫీ మంత్రిగా అయిన తర్వాత తన అభిమాని హీరో నందమూరి తారక రామారావును ఒకసారి కలవాలని చంద్రబాబు అనుకున్నారు .. ఎన్టీఆర్ కొడుకు జయకృష్ణ ద్వారా మొదటిసారి కలుసుకున్నారు ..
* అలాగే అనురాగ దేవత అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబుతో ఎన్టీఆర్ గంట సేపు కలిసి మాట్లాడారు ..
* ఆ మాటలోనే చంద్రబాబు వ్యక్తిత్వం ఎన్టీఆర్ కు నచ్చింది 1981లో తన కూతురు భువనేశ్వరితో చంద్రబాబుకు పెళ్లి జరిపించారు ..
• ఇక 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు .. ఇక ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యారు .. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు ఓడిపోయారు ..
* ఆ తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ కోరిక మేరకు టిడిపిలో చేరారు .. అలాగే టిడిపి ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్టీఆర్ కు కుడి భుజంగా ఉన్నారు ..
* 1984 ఆగస్టులో ఎన్టీఆర్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్ళినప్పుడు రాజకీయాల్లో పెను సంచలనాలు జరిగాయి .. ఆ సమయంలో చంద్రబాబు తన రాజకీయ చతురతతో ఎన్టీఆర్ ను తిరిగి సీఎం చేశారు ..
* ఇక. తెలుగుదేశం టిక్కెట్ పై 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేసి గెలిచారు .. ఇక అప్పటినుంచి అది చంద్రబాబుకు కంచు కోటగా మారింది ..
* ఇక 1995లో టీడీపీలో మళ్లీ పరిణామాలు మారాయి . ఆ ఏడాది సెప్టెంబరు 1న మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు .
* ఇక అప్పటినుంచి చంద్రబాబు తన రాజకీయ చతురతతో తెలుగు రాష్ట్రాలనే కాకుండా జాతీయస్థాయిలో కూడా నాయకత్వ లక్షణాలతో అగ్ర నాయకుడుగా హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు .. అలాగే 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా .. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు అరుదైన రికార్డును అందుకున్నారు ..