
చంద్రబాబు జగన్ తండ్రి వైఎస్సార్ సమకాలీనుడు ఆయనకు గౌరవంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలి. కానీ జగన్ వ్యక్తిగత సోషల్ మీడియాలో బాబును ఏకవచనంతో సంబోధిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇది జగన్ సూచన మేరకు ఆయన పీఆర్ టీం పెట్టి ఉండవచ్చు.. కానీ చూసేవాళ్లకు ఇది జగనే చేశాడనిపిస్తుంది కదా.. ఈ విషయంలో జగనో లేదా ఆయన వ్యక్తిగత వ్యవహారాలు చూసేవారో మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ? అదే చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని చెప్పారు ? మరి ఆ సంస్కారం ఇప్పుడు ఏమైంది ? ఏదేమైనా జగన్ పీఆర్ టీం విషయంలో జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది ? లేకపోతే ఇలాంటి చిన్న పొరపాట్లే రేపు కొన్ని సున్నితమైన విషయాల్లో జగన్ పరువును బజారుకు ఈడుస్తాయి. .
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.