ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ స్థానాలలో పిఠాపురం 2024 ఎన్నికల నుంచి ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా ఇక్కడ జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ నిలబడి పోటీ చేసి గెలిచినప్పటి నుంచి కూడా మళ్లీ వైరల్ గా మారుతున్నది. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత జనసేన బలం ఎంత ఉంది ఆ పార్టీ జోరు ఎంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంలో మారుతున్నది. ఎందుకంటే పిఠాపురంలో టిడిపికి అత్యంత బలంగా ఉన్నదని చెప్పవచ్చు.


పిఠాపురంలో టిడిపి పార్టీ నాయకులు కూడా చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. మరొకవైపు వైసీపీ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలాన్ని ఏ మేరకు పెంచుకున్నారన్నది ఇప్పుడు కార్యకర్తలలో ఒక చర్చనీయాంశంగా మారింది. గత పది నెలలలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పిఠాపురంలో ఎక్కువగా కాపులు ఉన్నారు టిడిపి తరఫున వర్మ మాస్ లీడర్ గా అక్కడ పేరు సంపాదించారు.


టిడిపి  మాజీ ఎమ్మెల్యే వర్మకు కాపులతో మంచి అనుబంధం కూడా ఉన్నది. పార్టీ పరంగానే కాకుండా స్థానికంగా కూడా మంచి గ్రిప్ ఉన్నదట. ప్రతి బూత్ లో కూడా వర్మ మనసులే ఉంటారు. పొలిటికల్ పరంగా ఆయన అక్కడ స్ట్రాంగ్ నేతగా పేరు సంపాదించారు. అయితే ఇలాంటి వ్యక్తి కాకుండా పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని గెలిపించినప్పటికీ కానీ అక్కడ డెవలప్ అయ్యే పరిస్థితిలే కనిపించలేదట. ఇక నాగబాబు పిఠాపురానికి వస్తే ఎప్పుడు ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతూ ఉంటారు. పిఠాపురం జనసేన అడ్డా అంటూ ఎన్నో సార్లు చెప్పిన.. జనసేన బలం పిఠాపురంలో పెద్దగా లేదనే విధంగా  వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బూత్ స్థాయి లెవెల్ లో పనిచేయడానికి జనసేన పార్టీకి ఎవరూ లేరట. ఇటీవలే ఒక సర్వే నిర్వహించగా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో ఎక్కడ కూడా ఒక సీటు రాదని.. పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో మూడవ స్థానం వచ్చే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: