టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా, ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, జబర్దస్త్ షో జడ్జిగా, పలు సామాజిక కార్యక్రమాలు చేసిన మహిళా నేతగా రోజాకు పేరుంది. 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో రోజా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పని చేయడం వల్ల రోజాకు ఓటమి తప్పదని అందరూ ఫిక్స్ అయారు. అయితే ఎన్నికల తర్వాత రోజాపై పలు భూ కబ్జా ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే.
 
కొంతమంది బాధితులు రోజా తమ భూమిని కబ్జా చేసిందని ఫిర్యాదు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది. విజయపురం మండలంలోని చిన్న గ్రామానికి చెందిన ఇల్లత్తు గుణశేఖర్ రెడ్డి అనే రైతు రోజా, ఆమె భర్త, మున్సిపల్ ఛైర్మన్ మీనా కుమార్ తమ స్థలం కబ్జా చేసి రేకుల షెడ్డు నిర్మించినట్టు ఫిర్యాదు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
భూ హద్దులు నిర్ణయించి తమకు, తమ కుటుంబానికి న్యాయం చేయాలని, గతంలో పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం ఫలితం లేకుండా పోయిందని సదరు వ్యక్తి చెబుతున్నారు. ఈ విమర్శల గురించి రోజా స్పందిస్తారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఈ ఫిర్యాదు విషయంలొ రోజా రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాలి.
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నెలలకే రోజా తిరుపతిలో భూ కబ్జా చేశారని ఆరోపణలు వినిపించగా తర్వాత రోజుల్లో ఆ ఆరోపణలు ఆగిపోయాయి. ఎన్నికల ఫలితాల తర్వాత రోజాకు ఇప్పటికే భారీ షాకులు తగలగా ఈ ఆరోపణలతో తాజాగా మరో షాక్ తగిలిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రోజా భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యే అవుతారో లేదో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. రోజాను ఎదుర్కొనే దమ్ము లేక ఆమెపై కుట్రలు చేస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: