ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఫ్యూచర్స్ లీడర్ ఎవరు అంటే కూటమిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది. ఇప్పుడైతే  ఏపీలో టిడిపి పార్టీ అధికారంలో ఉన్నది. అయితే ఈ పార్టీని సీనియర్ మోస్ట్ లీడర్గా పేరుపొందిన చంద్రబాబు నాయుడు ఆయన వయసు అనుభవంతో రాజకీయంగా టిడిపి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటివరకు కూటమిలో అయితే ఎలాంటి విభేదాలు కాని, వివాదాలు కానీ కనిపించడం  లేదు. చంద్రబాబు నాయకత్వం మరింతకాలం కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నానని ఎన్నోసార్లు తెలియజేశారు.



లోకేష్ విషయానికి వస్తే తన తండ్రి యాక్టివ్గా రాజకీయాలలో ఉన్నంత సేపు తోడుగానే ఉంటూ పార్టీలో ఇతర వ్యవహారాలలో యాక్టివ్గా చురుకుగా పాల్గొంటూ ఉన్నారు.  బాబు తర్వాత కూటమి న్యాయకత్వం ఎవరు తీసుకుంటారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న?. అయితే రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరు చెప్పలేం ఎందుకంటే ఐదేళ్ల తర్వాత ఏమవుతుంది పదేళ్ల తర్వాత పార్టీలు ఎలా ఉంటాయనే విషయం కూడా ఎవరు చెప్పలేరు. కానీ కూటమిలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నంతకాల ఓకే.. ఆ తరువాత ప్లేస్ ఎవరిది అనే విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ అన్నదే చర్చగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని జనసైనికులు కూడా ఎన్నోసార్లు తెలిపారు.

అయితే టిడిపి నేతలు కార్యకర్తలు మాత్రం కూటమిలో పెద్ద పార్టీ టిడిపి కాబట్టి ఆ పార్టీ నుంచి చూస్తే చంద్రబాబు తర్వాత నారా లోకేష్ కి ఆ అవకాశం ఉంటుందని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇరువురు పార్టీల వాదన ఇలా ఉన్నప్పటికీ ప్రజలలో నుంచి నాయకుడు అనేవారు పుట్టుకొస్తేనే ఎవరికైనా సీఎం అయ్యే అవకాశం కలుగుతుందనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి పర్యటనలు చేసిన.. సభలలో ఎక్కువగా మాట్లాడితే స్పందన మాత్రం పవన్ కళ్యాణ్ కి వస్తుందనే విధంగా విశ్లేషకులు తెలుపుతున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కి సొంతంగా పార్టీ ఉంది సినీ గ్లామర్ అండ కూడా ఉన్నది..

లోకేష్ వెనుక కూడా టిడిపి అనే ఒక బలమైన పార్టీ ఉంది.. కనుక ఇమేజ్ విషయంలో కొంత తేడా ఉన్నప్పటికీ టిడిపి పార్టీ అంటే ఒక బ్రాండ్ ఉండడంవల్ల ప్లస్ అవుతుంది. టిడిపికి కూడా సినీ గ్లామర్ అండ ఉన్నది.మరి ఏపీకి రాబోయే ఫ్యూచర్ లీడర్ ఎవరు అన్నది 2029 ఎన్నికలలో తేలుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: