ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ అనే పరిస్థితి ఉందనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కూటమి, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ వచ్చినా ఆ పార్టీ పుంజుకోవడం సక్సెస్ కావడం సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం ఒకింత విచిత్రమైన పరిస్థితి నెలకొందెని చెప్పాలి. ఏ పార్టీ పుంజుకుంటుందో ఏ పార్టీ డీలా పడుతుందో చెప్పే పరిస్థితి లేదు.
 
అయితే తెలంగాణ రాష్ట్రంలో కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. సొంతంగా బీ.ఆర్.ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కవిత సొంతంగా పార్టీ దిశగా అడుగులు వేయడంపై చర్చ జరుగుతోంది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి కవిత కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని కామెంట్లు చేశారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందిందని చెప్పుకొచ్చారు.
 
కాంగ్రెస్ పార్టీ సైతం కవిత తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తోందని గడిచిన పది సంవత్సరాలలో సామాజిక తెలంగాణను నిర్మించడంలో ఫెయిల్ అయినట్టు కవిత ఒప్పుకోవడాన్ని మెచ్చుకుంటున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో బీసీలు, మహిళలకు అన్యాయం జరిగినట్టు ఆమె వెల్లడించారని ఆయన అన్నారు. కేసీఆర్‌ నియంత పోకడలను అనుసరించకుండా కవిత కొత్త పార్టీ ఉండాలని వెల్లడించారు.
 
బీజేపీతో కలిసి బీఆర్‌ఎస్‌ నాటకాలు ఆడుతోందని ఇలా జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే కవిత కొత్త పార్టీ పెట్టే ముందు షర్మిల రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కవిత పార్టీ విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: