ఆంధ్రప్రదేశ్ - తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్వహిస్తున్న నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ ర‌హ‌దారికి 365 BG అని నామ‌క‌ర‌ణం చేశారు. ఆగస్టు 15 నాటికి ఈ హైవేను ప్రారంభించాలని శ‌రవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం - దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి మిగిలిన వాటికంటే పూర్తి భిన్నమైనది. పచ్చటి పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. మూడేళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణం చేపట్టారు. దేవరపల్లి - తల్లాడ జాతీయ‌ రహదారి డైమండ్ జంక్షన్ఖ‌/ రెండు కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరం ఉన్న నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే ను పచ్చటి పొలాల మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు.4609 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రహదారి కోసం 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది.


ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ - విశాఖపట్నం దూరం తగ్గించేందుకు ప్రధానంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు సుమారు 12 గంటల పాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త రహదారి పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే సుమారు 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. 8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. అలా నాలుగు గంటలు ఆదా అవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: