మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈడి భయం కొంతమేరకు తగ్గబోతోందట. సిబిఐ ,ఈడీ కేసులలో సిబిఐ కేసులలో ప్రాథమిక ఆధారాలు అనేవి లేవట. తన కేసులకు సంబంధించి ఉన్న ప్రధానమైన అంశం ఏమిటంటే.. పారిశ్రామికవేత్తలు లబ్ది పొందారు. అలా లబ్ది పొందిన వారే జగన్ సంస్థలు పెట్టుబడి పెట్టారు. ఆ పారిశ్రామికవేత్తలు కూడా అవును మేము పెట్టుబడి పెట్టాము.. మేము లబ్ధి పొందాము.. లబ్ధి పొందిన వాటికి లంచంగా పెట్టలేదు. వ్యాపారం కాబట్టి పెట్టుబడి పెట్టామని తెలిపారు. ఆ పెట్టుబడికి లాభాలు కూడా తీసుకున్నామని తెలిపారట.


అలాగే అలాంటి ప్రయోజనాలు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని.. సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలంటూ తెలిపారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది.. సబ్సిడీలను కుంభకోణం అని ఎట్లా అంటారు అన్నవాదన పారిశ్రామికవేత్తలు తెలియజేస్తున్నారు. కాబట్టి సిబిఐ కూడా అక్కడ ఏమీ చేయలేదు. ఏదైనా కూడా ఈడీ ద్వారానే చేయాలి. అయితే ఈడి కేసులు ఉన్నవి..ఈడికి ఇదివరకు ఏమిటంటే కాస్త కోర్టులో రిలయబిలిటీ ఎక్కువగా ఉండేది.. వీటిని ఎక్కువగా కోర్టు నమ్ముతూ ఉండేది.


అయితే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి కేసుల్లో టాస్క్మార్క్ విషయంలో ఈడిని తప్పు పట్టిందో అలాగే ఈ మధ్యన 8సార్లు ఈడిని తప్పు పట్టిందట సుప్రీంకోర్టు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారా అంటూ ఫైర్ కూడా అయ్యిందట. ఇలా ఎన్నిసార్లు తప్పు పట్టడంతో .. ఇక సుప్రీంకోర్టు కూడా మైండ్లో అలాగే ఫిక్స్ అవుతుంది. అప్పుడు  ఈడి చేసే వాదనలకి తమ చేతిలో ఉన్న పత్రాలు సరిపోవు.. ఆర్గ్యుమెంట్ కెపాసిటీ పెరగాలి.. కానీ ఇక్కడ ఈడి అటాచ్ చేసింది సిబిఐ కేసులు ఆధారంగే.. దీని ఆధారంగా చేసినప్పుడు ఏం చూపించాలి అంటే.. ఆ కంపెనీలే తప్పుడువని చూపించాలి. అని అక్కడ కంపెనీలన్నీ కూడా ఒరిజినల్ అని తేలింది. రాబోయే రోజుల్లో జగన్ కేసులు కంటిన్యూ అయితే. పేరు లేనటువంటి కంపెనీల నుంచి 20 కోట్లు 30 కోట్ల వరకు డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు విషయంలో మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటుందట.. అది పెనాల్టీ వేయవచ్చు.. లేకపోతే జైలు శిక్ష అయిన వేయవచ్చు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: