తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మారిపోయిందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తాజా ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ పరువు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి తీస్తున్నారనే విధంగా విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డిని ఈడి చార్జి సీట్లో కూడా చేర్చిందని.. 50 కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కున్నారంటూ కోమటిరెడ్డి చెప్పారంటూ తెలిపారు కేటీఆర్.


ఇప్పుడు నీ సీటు రూటు కుంభకోణం మరొకసారి బయటపడింది అంటూ కేసిఆర్ తాజా ప్రెస్ మీట్ లో ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు కేవలం మూటల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవ చేశారు.. తన పేరును నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి అధికారులు చేర్చినప్పటికీ ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు?. ఈ విషయం పైన రాహుల్ గాంధీ కూడా ఎందుకు ప్రశ్నించలేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నందువల్ల సీఎం పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడంటూ ఫైర్ అయ్యారు.


వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలని..లేకపోతే కాంగ్రెస్ నేతలు ఆయన సీఎం పదవి నుంచి దింపేయాలంటూ తెలియజేయడం జరిగింది.  తెలంగాణకు సీఎంగా అయినప్పటి నుంచి  అయిన తర్వాత 44 సార్లు వరకు ఢిల్లీకి వెళ్లారని ఢిల్లీలో అర్ధరాత్రి సమయంలో బిజెపి నేతలు కాళ్లు పట్టుకున్నారంటూ ఎద్దేవ చేయడం జరిగింది కేటీఆర్.. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాసులో ఉన్నారు..వారి వల్లే ఇలా నడుస్తున్నారని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేసి ఢిల్లీ బాస్ లకు చందాలు ఇస్తున్నారు అనే విధంగా కేటీఆర్ విమర్శించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కౌంటర్ వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: