అనుష్క పేరు వినగానే చాలామంది టాలీవుడ్ హీరోయిన్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయేది అనుష్క యాదవ్ గురించి.. తన పన్నెండేళ్ల రిలేషన్ షిప్ ను ఆర్జెడి సుప్రీం లాలు ప్రసాద్ యొక్క పెద్ద కుమారుడు అయినా తేజ్ ప్రతాప్ తో రిలేషన్ లో ఉన్నట్లుగా అంగీకరించారు. నిన్నటి రోజున తమ ఫేస్ బుక్ లో అనుష్కతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను తెలియజేస్తూ అందులో తమ అనుబంధాన్ని తెలియజేయడం జరిగింది.


ఇలా తమ సోషల్ మీడియాలో రాసుకుంటూ" నేను తేజ్ ప్రతాప్ యాదవ్ ను.. నాతో ఈ ఫోటోలో ఉన్నది అనుష్క యాదవ్ ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాము 12 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామంటూ తెలిపారు.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము.. కానీ అది ఎలాగో తెలియడం లేదు. ఈరోజు ఈ పోస్ట్ తో నా మనసులో మాటను మీతో పంచుకుంటున్నాను అంటూ తేజస్వి యాదవ్ ఈ పోస్టులో తెలియజేయడం జరిగింది".


తేజ్ ప్రతాప్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2018 లో బీహార్ మాజీ మంత్రి చందిక్రా రాయ్ తో వివాహం జరగగా కొద్ది రోజులలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అలా ఆరు సంవత్సరాలుగా కోర్టులో విడాకులు కేసు నడుస్తోంది. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ విదేశాలలో ఉన్నారు. ఈ ఏడాది చివరిలో జరగబోతున్నటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో వైశాలి జిల్లా మహువా నియోజవర్గం నుంచి తేజ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. గతంలో సమష్టిపూర్ లోని హసనాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వ్యవహరించే వారట.. అయితే 2015లో మహువా నియోజవర్గం నుంచి పోటీ చేసి మరి గెలిచారు. అందుకే ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని చూస్తున్నారట తేజ్ యాదవ్. అయితే అనుష్క యాదవ్ గురించి పూర్తి విషయాలు ఇంకా తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: