తండ్రి కొడుకుల్లా ఎంతో చక్కగా ఉండే జగన్ మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మధ్య రోజురోజుకీ దూరం పెరుగుతుంది.రీసెంట్గా ప్రెస్ మీట్ లో జగన్ విజయసాయిరెడ్డి పై కామెంట్లు చేయడంతో విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు.అయితే తాజాగా విజయ్ సాయి రెడ్డి టిడిపి వారితో కలిసి పోయారు అంటూ ఒక సంచలన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ వీడియోని స్వయంగా వైఎస్సార్సీపి వాళ్లే రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో పై తాజాగా స్పందించారు విజయసాయిరెడ్డి. ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సంచలన ట్వీట్ చేశారు..ఆ ట్వీట్ లో ఏముందంటే.. నేను టిడిపిలోకి వెళ్లడం లేదు. నేను ప్రాణం పోయే వరకు టిడిపిలో కలవనని ముందే చెప్పాను. ఒకవేళ టీడీపీలోకి వెళ్లాలి అనుకుంటే చంద్రబాబు లోకేష్ ని నేరుగా కలుస్తాను. ఇలా మంతనాలు చేయను. నాకు ఘట్టమనేని కృష్ణ గారితో రెండు దశాబ్దాలు అనుబంధం ఉంది. 

ఈ అనుబంధం తోనే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లాను.కానీ అక్కడికి అనుకోకుండా జనార్దన్ రెడ్డి వచ్చారు. అయితే ఆయన వస్తున్నారనే విషయం నాకు ముందుగా తెలియదు. ఈ విషయం తెలియని కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను సైలెంట్ గా ఉండడం వైఎస్ఆర్సిపి కోటరీ లోని కొంతమందికి నచ్చడం లేదు. అందుకే నన్ను తరచూ కెలుకుతున్నారు. నన్ను కెలకొద్దు.. ఇరిటేట్ చేయొద్దు.. నా మీద లేనిపోని దుష్ప్రచారం చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వీటిపై స్పందించాల్సి వస్తుంది. నేను రియాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అని కోరుకున్న వారే నా రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని ఈ కోటరీ వల్ల ఆలోచనలేని చర్యల వల్ల వైఎస్ఆర్సిపి కోటరీలో నెంబర్ 2 ప్రాధాన్యం దక్కుతుంది అనే వారికి లాభం చేకూరుతుంది.

కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. 2011లో నేను దాదాపు 21 కేసుల్లో ఇరుక్కున్నాను. వాటితో నాకు సంబంధం లేకపోయినా కూడా బలి పశువునయ్యాను. ఇక ఈ ఏడాది కూడా అలాంటి స్కాంలో ఇరుక్కోమని జగన్ గారే స్వయంగా చెబితే నాకు సంబంధం లేకున్నా కూడా నేను దాని బాధ్యత తీసుకునే వాడిని. నేను దాదాపు మూడు తరాలుగా జగన్ గారి కుటుంబానికి మేలు చేశాను. కానీ కోటరిలోని కొంతమంది మాటలు నమ్మి జగన్ నన్ను పక్కన పెట్టారు. వైఎస్ఆర్సిపి కోటరీ నన్ను వెన్నుపోటు పొడిచింది. అందుకే పార్టీలో ఉండి అబండాలు,నిందలు మోయలేనని బయటికి వచ్చేసాను అంటూ జగన్మోహన్ రెడ్డికి, వైసిపి కోటరీ లో విజయసాయిరెడ్డికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరికీ ఒక సంచలన ట్వీట్ తో బుద్ధి చెప్పారు విజయ సాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: