
ఏపీలో రేషన్ వాహనాల ద్వారా రేషన్ సరఫరా జరుగకుండా రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ జరిగేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయాల విషయంలో సైతం కీలక మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా చేయడంలో కూటమి సర్కార్ సఫలమవుతోంది.
వైసీపీపై ద్వేషం పెంచే విధంగా కూటమి సర్కార్ తెలివిగా అడుగులు వేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ రాష్ట్రంలో పుంజుకోవడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ఎక్కువగా బెంగళూరుకు పరిమితం కావడం విషయంలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ తరపున సరైన నేతలు లేకపోవడం కూడా పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. జగన్ మళ్లీ పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వైసీపీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అనే ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు