
ఏ పార్టీ అలా చేయించిందనే ప్రశ్నకు ఎక్కువమంది నెటిజన్లు అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ప్రజాభిప్రాయం కోసం కాల్స్ చేయించి ఉండవచ్చని ఫీలవుతున్నారు. ఈ కాల్స్ కు రియాక్ట్ కావడానికి ఎక్కువమంది ఇష్టపడలేదు. ఏ పార్టీకి అనుకూలంగా చెబితే తమ పథకాలు రద్దు అవుతాయో అనే భయం చాలామంది ఓటర్లలో ఉంది. ఈ తరహా సర్వేలు ప్రజలను సైతం టెన్షన్ పెడుతుతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు ప్రజలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి మరో నాలుగేళ్ల సమయం ఉంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ఒకింత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ మాత్రం క్రమంగా పుంజుకుంటోంది.
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక పార్టీ మరో పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్రంలో జగన్ అరెస్ట్ అవుతారా? లేదా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఏపీ రాజకీయాలలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే చర్చ సైతం విశ్లేషకుల మధ్య జరుగుతోంది. ఈ సర్వేల విషయంలో ప్రజలు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు