
రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకుల పై సోషల్ మీడియాలో సెటైర్లు రావడం సహజంగానే మారింది. ఒకప్పుడు దూషణలు , విమర్శలతో ట్రోల్స్ వస్తే ఇప్పుడు ట్రోలింగ్ కొత్తదారులు వెతుక్కుంటుంది. నాయకులు చేస్తున్న పనులు కూడా కొంత వివాదాల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో ట్రోలింగ్ చేసేవారు చేస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న పనులు కూడా అలాగే ఉంటున్నాయి. దీంతో నాయకులపై సెటైర్లు , కామెంట్లు ఆగటం లేదు. రెండు రోజుల కిందట జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పెనమలూరులో ఓ సెలూన్ దుకాణాన్ని ప్రారంభించారు. ఇది ప్రైవేటు కార్యక్రమం అని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్పి స్తాయి అధికారి కూడా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఓ సెలూన్ దుకాణం ప్రారంభించడం ఆయన వ్యక్తిగత వ్యవహారం. అయినా ఆయన వేసుకున్న డ్రెస్ పైన సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు పవన్ షార్ట్ వేసుకున్న వచ్చారు.
సాధారణంగా లాల్చీ , పైజామా లేదా ఇతర డ్రెస్ లో ఉండే పవన్ కళ్యాణ్ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి మాత్రం షార్ట్ పై వచ్చారు. దీంతో భారీగా ట్రోలింగ్ నడిచింది. టిడిపి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన పనిపై కూడా సెటైర్లు విమర్శలు వచ్చాయి. ఆయన కూడా ఇలాంటి కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేసిన మహిళల నైటీల షాప్ రెండు రోజుల క్రింద కోటంరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. దీనిపై నెటిజన్లు ట్రోల్ చేశారు. వైసీపీ నాయకులు దీనిపై విమర్శలు గుర్తించారు. నైటీల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం ఏంటన్నది ? నెటిజనులు అందిస్తున్న ప్రశ్న. దీనిపై కోటంరెడ్డి స్పందించారు. ఒక నిరుపేద సోదరి తన రెక్కల కష్టంతో జీవన ఉపాధి కోసం చిన్న వస్త్రాల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లానన్నారు. స్థానిక కమ్యూనిస్టు నాయకుల ఆహ్వానం మేరకు తను వెళ్ళినట్టు శ్రీధర్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఆమె ఆశయాన్ని నిలబెట్టేందుకు హాజరైన సందర్భాన్ని అపహాస్యం చేయటం తగదని ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు