ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి ఎల్లప్పుడూ అనుకూలంగా వ్యవహరించే పత్రికలలో ఆంధ్రజ్యోతి ముందువరసలో ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఆంధ్రజ్యోతి టీడీపీ చేస్తున్న తప్పులను సైతం తమ పత్రికలో ప్రస్తావిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం స్మార్ట్ మీటర్ల విషయంలో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం సంచలనం అయింది. తాజా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు గురించి సైతం ఈ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

రాష్ట్రంలో  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలు జరగకుండా జగన్ కొంతమేర జాగ్రత్త పడ్డారు.  గ్రామ వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు సైతం గత ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేలతో పని లేకుండా పోయింది. కార్యకర్తలు, నేతలు  జగన్ కు షాకిచ్ఛేలా వ్యవహరించడం వల్లే గత ఎన్నికల్లో వైసీపీకి ఘోరమైన ఫలితాలు దక్కాయి.  వాళ్లలో వ్యతిరేకత లేకుండా ఉండి ఉంటే జగన్ కు ఇలాంటి ఫలితాలు అయితే ఎదురై ఉండేది కాదని చాలామంది ఫీలవుతారు.

అయితే వైసీపీ పాలనలో సైతం కొంతమంది ఎమ్మెల్యేలు బాగానే సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం కూటమి పాలనలో సైతం కొందరు  ఎమ్మెల్యేల అక్రమాల గురించి ఆంధ్రజ్యోతి  కథనాలు ప్రచురిస్తోంది.  వైసీపీ నేతల బాటలోనే టీడీపీ ఎమ్మెల్యేలు నడుస్తున్నారని ఈ పత్రిక పేర్కొంది. అయితే సొంత పత్రిక తీరు వాళ్ళ టీడీపీకే లాభమని చంద్రబాబు కొంతమేర జాగ్రత్త పడే అవకాశాలు  ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ నేతలతో పోలుస్తూ కథనాలను ప్రచురించడం వల్ల  టీడీపీకి తాము వ్యతిరేకం కాదనే భావనను  ఆంధ్రజ్యోతి కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో కూటమి పాలన విషయంలో ఈ పత్రిక ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి వుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: