కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆడపిల్లల పైన ఎక్కువగా దారుణమైన ఘటనలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయనే ఘటనలు ప్రతిపక్ష పార్టీ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన చూసిన వారందరూ కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అప్పులు వసూలు చేసేందుకు ఒక మహిళను సైతం చెట్టుకు కట్టేసి మరి దాడి చేసిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం 80 వేల రూపాయలకే ఇలాంటి ఘటన చేసినట్లు తెలుస్తోంది.



కుప్పం నియోజకవర్గంలో నారాయణపురంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందట.. అసలు విషయంలోకి వెళితే నారాయణపురాణానికి చెందిన తిమ్మరామప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద 80000 వరకు అప్పు తీసుకున్నారట. అయితే ఈ అప్పుల బాధలను భరించలేక వీరు ఊరు విడిచి వెళ్లిపోగా..తిమ్మరాముప్ప భార్య శిరీష పుట్టినిల్లు శాంతిపురంలో ఉంటోందట. అయితే ఈమె కూడా కూలి పనులు చేసుకుంటూ తన కుమారుడని పోషిస్తూ ఉండేది. నిన్నటి రోజున పాఠశాలలో తన కుమారుడి టిసి కోసం వచ్చిన శిరీషను గమనించిన మునికన్నప్ప అతని భార్య మునెమ్మ కుటుంబ సభ్యులతో కలిసి శిరీష పైన దాడి చేశారు.



శిరీష భర్త తిమ్మరామప్ప తీసుకున్నటువంటి డబ్బులను చెల్లించాలని వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆమెను చెట్టుకు కట్టేసి మరి దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళింది. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో గంటన్నర వ్యవధిలో మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లుగా కుప్పం పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయం ఏపీ అంతట సంచలనంగా మారడంతో సీఎం చంద్రబాబు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. అలాంటి పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: